న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

24వ టెస్టు సెంచరీ: కోహ్లీ సాధించిన టాప్-5 టెస్టు సెంచరీలివే

India vs West Indies 2018 : Kohli's Top 5 Centuries In Test Matches
India vs West Indies: The top 5 Test hundreds of Virat Kohli

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 184 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ కావడం విశేషం.

<strong>ఈ సెంచరీ ఆయనకే అంకితం: పృథ్వీ షా సెంచరీ వెనుక నాన్న</strong>ఈ సెంచరీ ఆయనకే అంకితం: పృథ్వీ షా సెంచరీ వెనుక నాన్న

ఓవర్‌నైట్ స్కోరు 364/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత బ్యాట్స్‌‌మెన్లలో తొలుత కెప్టెన్ కోహ్లీ ఆచితూచి ఆడినా.. అవతలి ఎండ్‌లో ఉన్న రిషబ్ పంత్ మాత్రం చెలరేగిపోయాడు. ఆరంభం నుంచే పేసర్లు, స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగుతూ ఎడాపెడా ఫోర్లు బాదేశాడు.

India vs West Indies: The top 5 Test hundreds of Virat Kohli

కోహ్లీ సెంచరీకి సమీపించే సరికి పంత్ కూడా 80లోకి వచ్చాడు. కోహ్లీ సెంచరీ ముగిసిన కొద్దిసేపటికే భారీ షాట్ కోసం ప్రయత్నించి వ్యక్తి స్కోరు 92 వద్ద రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో లంచ్ విరామయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 533 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.

1
44264

టెస్టు క్రికెట్‌లోకోహ్లీ టాప్-5 సెంచరీలు మీకోసం:

1. 103, ట్రెంట్‌బ్రిడ్జి, 2018

1. 103, ట్రెంట్‌బ్రిడ్జి, 2018

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన సిరిస్‌లో టీమిండియా గెలిచిన ఏకైక టెస్టు ఇదే కావడం విశేషం. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగిన ఈ టెస్టులో విరాట్ కోహ్లీ చెలరేగాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా గెలిచిన ఏకైక టెస్టు ఇదే కావడం కావడం. ఈ సిరిస్‌ను కోహ్లీసేన 1-4తే చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

2. 153, సెంచూరియన్, 2018

2. 153, సెంచూరియన్, 2018

ఈ ఏడాది మొదట్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ టెస్టులో కోహ్లీ ఒక్కడే ఫైటింగ్ స్పిరిట్‌తో పోరాడాడు. భారత ఇన్నింగ్స్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేయలేదు. కేవలం కోహ్లీ ఒక్కడే సఫారీ పేస్ ఎటాక్ మోర్నీ మోర్కెల్, వెర్నాన్ ఫిన్ లాండర్, కగిసో రబడ, లుంగి ఎంగిడిలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో కోహ్లీ తన మాస్టర్ క్లాస్‌తో 153 పరుగులు చేశాడు. కోహ్లీ పర్సనల్ బెస్ట్‌లో ఇదొకటి.

3. 115 & 141, అడిలైడ్, 2014

3. 115 & 141, అడిలైడ్, 2014

కోహ్లీ కెరీర్‌లోనే ఈ పర్యటన ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అడిలైడ్ వేదికగా జరిగిన ఈ టెస్టులో కోహ్లీ రెండు సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 115 పరుగులతో రాణించడంతో టీమిండియా 444 పరగులు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 175 బంతుల్లో 141 పరుగులతో మరో సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్(99) ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోయాడు. ఇక, ఆతిథ్య జట్టులో సైతం డేవిడ్ వార్నర్ 145, 102 పరుగులతో రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఏడు వికెట్లతో చేలరేగడంతో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.

4. 204, హైదరాబాద్ (2017)

4. 204, హైదరాబాద్ (2017)

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఆతిథ్యమిచ్చింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. 246 బంతుల్లో కోహ్లీ 204 పరుగులు చేశాడు. కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్ కూడా అత్యుత్తమం.

5. 169, మెల్‌బోర్న్ (2014)

5. 169, మెల్‌బోర్న్ (2014)

2014 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ జూలు విదిల్చాడు. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ షార్ట్ పిచ్ బంతులతో కోహ్లీ భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే, కోహ్లీ మాత్రం ఆసీస్ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రహానేలు నాలుగో వికెట్‌కు 262 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్ల వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌ చివరకు డ్రాగా ముగిసింది. భారత్ తరుపున ధోనికి ఇదే చివరి టెస్టు కావడం విశేషం.

Story first published: Friday, October 5, 2018, 15:51 [IST]
Other articles published on Oct 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X