Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West indies: నేడే చారిత్ర‌క 1000వ వ‌న్డే.. చిరస్మ‌ర‌ణీయం చేయాల‌నే లక్ష్యంతో భార‌త్‌

India vs West indies: Team India will play its 1000th ODI today.. ODI series starts with the West Indies today

అహ్మ‌దాబాద్‌:భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో నేడు వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ రికార్డు పుటల్లో సుస్థిరంగా నిలిచిపోనుంది. వ‌న్డే క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 999 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా నేటి మ్యాచ్‌తో 1000 వ‌న్డేలు ఆడిన తొలి జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించ‌నుంది. ఈ చ‌రిత్రాత్మ‌క మ్యాచ్‌లో గెలిచి చిర‌స్మ‌ర‌ణీయం చేసుకోవాల‌ని రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ప‌ట్టుద‌ల‌గా ఉంది. అటు నేటి వ‌న్డే మ్యాచ్‌తో భార‌త్, వెస్టిండీస్ వ‌న్డే సిరీస్ కూడా ప్రారంభం కానుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా నేడు మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు తొలి వ‌న్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. క‌రోనా కార‌ణంగా ఈ సిరీస్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌డం లేదు.

హాట్ ఫెవ‌రేట్‌గా భార‌త్

హాట్ ఫెవ‌రేట్‌గా భార‌త్

ఈ సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా హాట్ ఫెవ‌రేట్‌గా బ‌రిలోకి దిగుతోంది. హోం గ్రౌండ్ కావ‌డం కూడా భార‌త జ‌ట్టుకు క‌లిసి రానుంది. దీంతో టీమిండియా ఆత్మ‌విశ్వాసంతో బ‌రిలోకి దిగుతుంది. గాయం కార‌ణంగా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ ఈ సిరీస్ మొత్తం ఆడున్నాడు. రోహిత్‌కు జ‌త‌గా ఇషాన్ కిష‌న్ ఓపెనింగ్‌లో రానున్నాడు. చాలా కాలంగా సెంచ‌రీ చేయ‌ని సీనియ‌ర్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లోనైనా ఆ లోటు తీర్చాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక బ్యాటింగ్‌లో రిష‌బ్ పంత్, సూర్య‌కుమార్ యాద‌వ్ ఉండ‌నున్నారు. ఆల్‌రౌండ‌ర్ కోటాలో దీప‌క్ హుడా లేదా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు చోటు ద‌క్క‌నుంది. బౌల‌ర్ల‌లో దీపక్‌ చాహర్‌, శార్దూల్‌, కుల్దీప్‌, చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణకు చోటు ద‌క్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

ఆత్మ‌విశ్వాసంతో వెస్టిండీస్‌

ఆత్మ‌విశ్వాసంతో వెస్టిండీస్‌

ఇటీవ‌ల ఇంగ్లండ్‌పై 3-2తో టీ20 సిరీస్ గెలిచిన వెస్టిండీస్ ఈ సిరీస్‌లో ఆత్మ‌విశ్వాసంతో బ‌రిలోకి దిగుతోంది. ఇండియాను కూడా ఓడించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. కీర‌న్ పొలార్డు నేతృత్వంలోని వెస్టిండీస్ జ‌ట్టు స‌మ‌తూకంగా ఉంది. భారీ హిట్ల‌ర్లు ఉన్న విండీస్ టీం క్ష‌ణాల్లో వ్య‌వ‌ధిలో మ్యాచ్ ఫ‌లితాన్ని మార్చేయ‌గ‌ల‌దు. ఈ సిరీస్ కోసమే కొంద‌రు సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను కూడా ఆ జ‌ట్టులో చేర్చారు. చాలా కాలంగా ఇండియాలో వ‌న్డే సిరీస్ గెల‌వ‌డ‌ని వెస్టిండీస్ ఈ సారి ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.

మ్యాచ్ ఘ‌న‌త‌లు

మ్యాచ్ ఘ‌న‌త‌లు

రోహిత్ శ‌ర్మ‌కు వ‌న్డే కెప్టెన్సీ అప్ప‌గించిన త‌ర్వాత భార‌త జ‌ట్టు ఆడుతున్న తొలి వ‌న్డే సిరీస్ ఇదే. అలాగే ఏడేళ్ల త‌ర్వాత అహ్మ‌దాబాద్‌లో జ‌ర‌గుతున్న తొలి వ‌న్డే కూడా ఇదే. స్పిన్న‌ర్ య‌జుర్వేంద్ర చాహ‌ల్ వంద వికెట్ల క్ల‌బ్‌లో చేర‌డానికి మ‌రో వికెట్ దూరంలో ఉన్నాడు.

పిచ్ ప్ర‌భావం:

పిచ్ ప్ర‌భావం:

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించ‌నుంది. అదే స‌మ‌యంలో గ్రౌండులో బౌండ‌రీలు పెద్ద‌వి. దీంతో భారీ షాట్లు ఆడ‌డానికి బ్యాట‌ర్ల‌కు స‌వాల్ విస‌ర‌నున్నాయి. మంచు ప్ర‌భావం కూడా ఉండే అవ‌కాశం ఉంది.

 తుది జ‌ట్లు(అంచ‌నా)

తుది జ‌ట్లు(అంచ‌నా)

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, కోహ్లీ, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌, కుల్దీప్ యాద‌వ్‌, చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.

వెస్టిండీస్‌:

షాయ్‌ హోప్‌, బ్రండన్‌ కింగ్‌, పూరన్‌, షమారా బ్రూక్స్‌, బ్రావో, పొలార్డ్‌ (కెప్టెన్‌), స్మిత్‌, హోల్డర్‌, అకిల హుసేన్‌, రోచ్‌, హేడెన్‌ వాల్ష్‌.

Story first published: Sunday, February 6, 2022, 8:57 [IST]
Other articles published on Feb 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+