For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్ టీ20: భారత్‌ ముమ్మర సాధన.. కొత్తగా 'ఛేజ్‌ డ్రిల్‌' ప్రాక్టీస్!!

India vs West Indies T20 2019 : Team India's Chase Drill Practice || Oneindia Telugu
India vs West Indies: Team India Practice in uppal for 1st T20

హైదరాబాద్‌: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, వెస్టిండీస్ జట్లు రెండు రోజుల క్రితమే నగరానికి చేరుకున్నాయి. వెస్టిండీస్ జట్టు మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తే.. భారత్ బుధవారం కసరత్తులు ప్రారంభించింది.

భారత్‌ ముమ్మర సాధన:

భారత్‌ ముమ్మర సాధన:

కోహ్లీసేన బుధవారం మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసింది. ఉదయం వెస్టిండీస్‌ క్రికెటర్లు సాధన చేయగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. వామప్‌ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి సాధన చేశారు. ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ నేృత్వతంలో చాహల్‌, శివమ్‌ దూబే, సంజూ శాంసన్‌, కుల్‌దీప్‌, భువనేశ్వర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ క్యాచ్‌లు పట్టడం.. త్రోలు విసరడం ప్రాక్టీస్‌ చేశారు.

ప్రాక్టీస్‌లో కోహ్లీ, రోహిత్:

ప్రాక్టీస్‌లో కోహ్లీ, రోహిత్:

కోచ్‌ రవిశాస్త్రి, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ పర్యవేక్షణలో నెట్స్‌లో రోహిత్‌ శర్మ పేస్‌ పిచ్‌పై, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ స్పిన్‌ పిచ్‌పై ప్రాక్టీస్ చేశారు. కోహ్లీ సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. నెట్స్‌లోనే ముందుకొచ్చి భారీ షాట్లు ఆడాడు. ఆ తర్వాత స్విచ్‌ హిట్‌ను కూడా ప్రయత్నించాడు. రోహిత్‌ కూడా ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. విరామం తర్వాత పునరాగమనం చేస్తున్న భువనేశ్వర్‌ కుమార్‌కు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ పలు సూచనలు ఇచ్చాడు. ఈనెల 2న వివాహం చేసుకున్న మనీష్‌ పాండే గురువారం జట్టులో చేరనున్నాడు.

కొత్తగా ఛేజ్‌ డ్రిల్‌:

భారత ఆటగాళ్లలో ఒక బృందం ముందు నిలబడి తమ షార్ట్స్‌లో ఎరుపు రంగు కర్చీఫ్ పెట్టుకున్నారు. వెనకాల మరో బృందం పసుపు రంగు కర్చీఫ్ పెట్టుకుని నిలబడ్డారు. ట్రైనర్‌ విజిల్‌ వేయగానే అంతా పరుగు మొదలు పెట్టేశారు. తమ ముందు నిలబడ్డ ఆటగాడి కర్చీఫ్ అందుకోవడమే వెనక ఉన్నవారి పని. ఇలా ఒకరి తర్వాత మరొకరు ఈ ఛేదనలో పాల్గొన్నారు. ముందు వరుసలో నిలబడిన ఆటగాళ్లు వెనకకు వెళ్లిపోయి తమ పరుగు సత్తాను పరీక్షించుకున్నారు. దీన్నే ఛేజ్‌ డ్రిల్‌ అంటారు.

ప్రధానాయుధం బ్యాటింగే:

ప్రధానాయుధం బ్యాటింగే:

ఇటీవలి కాలంలో భారత బౌలింగ్ మెరుగుపడ్డా.. భారత ప్రధానాయుధం బ్యాటింగే. టాపార్డర్ రాణిస్తే తిరుగుండదు. శిఖర్ ధవన్ గాయంతో జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో లోకేశ్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ, రోహిత్ గురించి చెప్పేదేముంది. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలు ఉన్నారు. పంత్ స్థానంలో చోటు దక్కితే.. శాంసన్ చేలరేగిపోవాలని చూస్తున్నాడు. హిట్టర్ శివం దూబే ఈసారైనా మెరుపులు మెరిపించాలని భావిస్తున్నాడు. భువీ, షమీ, చాహర్, చహల్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.

Story first published: Thursday, December 5, 2019, 9:12 [IST]
Other articles published on Dec 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+