ఈసారైనా సంజూ శాంసన్ కల నెరవేరేనా?: శిఖర్ ధావన్ స్థానంలో ఎంపిక

హైదరాబాద్: వెస్టిండిస్‌తో పరిమిత ఓవర్ల సిరిస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా వెస్టిండిస్‌తో డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు శిఖర్ ధావన్ దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు సంజూ శాంసన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. క్రీజును చేరుకునే సమయంలో డైవ్ చేయడంతో శిఖర్ ధావన్ కాలుకి కట్టె ముక్క కోసుకుంది. దీంతో ధావన్ మోకాలికి 20 కుట్లు పడ్డాయి. గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో సంజు శాంసన్‌కు చోటిచ్చారు.

మూడు టీ20ల సిరిస్‌కు
బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌కు సంజూ శాంసన్ ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడదు. ఫలితంగా సిరిస్ మొత్తం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మూడు మ్యాచుల్లోనూ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడానికే సంజూ శాంసన్‌ను జట్టు మేనేజ్‌మెంట్ ఉపయోగించుకుంది.

విండిస్ సిరీస్ కోసం
ఇటీవలే విండిస్ సిరీస్ కోసం టీ20, వన్డే జట్లను ఎంపిక చేశారు. అందులో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే, అతడిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా శిఖర్ ధావన్ గాయం కారణంగా విండిస్‌తో సిరిస్‌కు దూరం కావడంతో సెలక్టర్లు శాంసన్‌ను ఎంపిక చేశారు.

2015లో జింబాబ్వేపై
2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడిన సంజూ శాంసన్ ఏడో స్థానంలో దిగి 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేదు. భారత్‌లో వెస్టిండిస్ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ జరగనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 డిసెంబర్ 6న హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.
జట్ల వివరాలు
వన్డే జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్
టీ20 జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్

భారత్‌లో వెస్టిండీస్ పర్యటన వివరాలు:
మూడు టీ20లు:
తొలి టీ20 - డిసెంబర్ 6, శుక్రవారం (ముంబై)
రెండో టీ20 - డిసెంబర్ 8, ఆదివారం (తిరువనంతపురం)
మూడో టీ20- డిసెంబర్ 11, బుధవారం (హైదరాబాద్)
మూడు వన్డేలు:
తొలి వన్డే - డిసెంబర్ 15, ఆదివారం (చెన్నై)
రెండో వన్డే - డిసెంబర్ 18, బుధవారం (విశాఖపట్నం)
మూడో వన్డే - డిసెంబర్ 22, ఆదివారం (కటక్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications