మైదానంలోకి శునకం.. వెంటబడ్డ విండీస్ ఆటగాళ్లు.. మ్యాచ్‌కు అంతరాయం (వీడియో)!!

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం చెన్నై చెపాక్ స్టేడయంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయిర్ (106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 139 పరుగులు) సెంచరీ చేయడంతో టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. హెట్‌మెయిర్ భారీ షాట్లతో విరుచుకుపడడంతో భారత బౌలర్లు ఏ దశలోనూ మ్యాచ్‌ను కాపాడలేకపోయారు.

27వ ఓవర్‌లో ఘటన:
తొలి వన్డేలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ శునకం హఠాత్తుగా మైదానంలోకి దూసుకురావడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. భారత్ ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. కీమో పాల్ బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు.

మైదానంలోకి శునకం:
పాల్ బంతిని వేస్తుండగా.. అయ్యర్ బ్యాట్ పట్టుకుని స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో భద్రతా అధికారుల నుండి తప్పించుకొని ఓ శునకం మైదానంలోకి దూసుకొచ్చింది. ఇది గమనించిన ఆటగాళ్లు చూస్తూ ఉండిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది శునకంను పట్టుకునేందుకు మైదానంలోకి వచ్చారు.

వెంటబడ్డ విండీస్ ఆటగాళ్లు:
ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ ఆటగాళ్లు కూడా శునకంను తరిమేందుకు దాని వెంటపడ్డారు. దీంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది దానిని బయటకు పంపడంతో మ్యాచ్ తిరిగి మొదలైంది. ఈ ఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులు కాసేపు సందడి చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియోను ఎంతోమంది వీక్షించారు.

విశాఖలో రెండో వన్డే:
ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. పంత్ (71), శ్రేయస్ (70) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కేదార్ జాదవ్ (40) రాణించాడు. అనంతరం విండీస్ 2 వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హెట్‌మెయిర్ (139), హోప్ (102) సెంచరీలు చేశారు. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications