భారత్‌పై క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ బాది 10 ఏళ్లు అవుతుంది

హైదరాబాద్: టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఆఖరిదైన మూడో వన్డే బుధవారం జరగనుంది.
దీంతో మూడో వన్డేలో కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే, గాయం తర్వాత విండిస్ పర్యటనలో పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంకా గాడిన పడకపోవడం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది.
మూడు టీ20ల సిరిస్‌లో ధావన్ 1, 23, 3 పరుగులతో నిరాశ పరిచాడు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఇక, రెండో వన్డేలో 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. వన్డే సిరిస్ అనంతరం టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో టెస్టుల్లో చోటు దక్కించుకునేందుకు ధావన్‌కు మూడో వన్డే చివరి అవకాశం కానుంది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో ధావన్ ఒత్తిడితో బరిలోకి దిగుతుండగా... మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు అరుదైన రికార్డులకు చేరువయ్యారు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు
413 - ఈ వేదికలో టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇది. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఈ స్కోరు సాధించింది.
#62 - మూడో వన్డేలో గనుక టీమిండియా విజయం సాధిస్తే... భారత జట్టుపై వెస్టిండిస్ సాధించిన విజయాల సంఖ్య(62)ను సమం చేస్తుంది.

భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ తీస్తే
1 - వన్డేల్లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ స్టేడియంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో వికెట్ తీస్తే... ఈ వేదికలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అరుదైన గుర్తింపు సాధిస్తాడు.
58 - వన్డేల్లో భారత క్రికెట్ జట్టుపై షాయ్ హోప్ 500 పరుగుల మైలురాయిని అందుకోడానికి అవసరమైన పరుగులు.

వన్డేల్లో 500 పరుగుల మైలురాయిని
91 - వన్డేల్లో 500 పరుగుల మైలురాయిని అందుకోడానికి వెస్టిండిస్ ఆటగాడు నికోలస్ పూరన్‌కు అవసరమైన పరుగులు.
27 - రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు మరో 27 పరుగులు చేస్తే వన్డేల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలుస్తుంది. ఫలితంగా వన్డేల్లో వెస్టిండిస్‌పై ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జోడీగా చరిత్ర సృష్టిస్తారు.

యజువేంద్ర చాహుల్‌కు 50వ వన్డే
#50 - మూడో వన్డే తుది జట్టలో యజువేంద్ర చాహుల్‌కు గనుక చోటు లభిస్తే అతడికి ఇది 50వ వన్డే అవుతుంది.
10 - టీమిండియాపై క్రిస్‌గేల్ హాఫ్ సెంచరీ బాది 10 ఏళ్లు అవుతుంది. 2009 జూన్ 28న కింగ్‌స్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 46 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications