కోహ్లీ ఎవరికీ తక్కువ కాదు: సచిన్‌తో పోల్చడంపై సౌరవ్ గంగూలీ


హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. తాజాగా విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ సైతం చేరాడు. కోహ్లీ ఆధునిక క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. అయితే, సచిన్‌తో కోహ్లీని పోల్చలేనని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని చేరే క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

పదివేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ
ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్ర సింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరాడు.

ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్
ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ ప్రదర్శనపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదు. ఈరోజు వికెట్ చాలా భిన్నంగా ఉంది. పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. అయినా సరే గేమ్ పూర్తిగా మారిపోయింది. ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్. మాట్లాడేందుకు మాటలు రావడం లేదు" అని అన్నాడు.

సచిన్ ఆటను చాలా దగ్గరగా చూశా
"సచిన్ టెండూల్కర్ ఆటను చాలా దగ్గర నుంచి చూశా. వన్డేల్లో 49 కాగా, మొత్తంగా 100 సెంచరీలను సచిన్ బాదినప్పుడు ఎంతో దగ్గరగా చూశా. అయితే, విరాట్ కోహ్లీ కూడా ఎవరికీ తక్కువ కాదు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయమేటంటే.. అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును తన భుజాలపై వేసుకొని ఆటను మార్చేయగల సత్తా గల ఆటగాడు. ఇంగ్లాండ్‌లో అతని ప్రదర్శనే దీనికి ప్రత్యేక ఉదాహరణ. ఒకవైపు ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవుతుంటే.. కోహ్లీ మాత్రం ఒక్కడే సెంచరీలు చేస్తూ జట్టును ముందుండి నడిపించాడు" అని గంగూలీ చెప్పాడు.

వన్డేల్లో కోహ్లీకి 37వ సెంచరీ
"అతను కచ్చితంగా ప్రపంచ క్రికెట్‌లో, భారత క్రికెట్‌లో ఎప్పటికీ గొప్ప క్రికెటరే. ప్రస్తుతానికి అతని వయస్సు కేవలం 30ఏళ్లే. అంటే తన కెరీర్ కొనసాగించడానికి ఇంకా ఎంతో సమయం ఉంది. 2014లో ఇంగ్లాండ్ పర్యటన నుంచి ఒక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చాలా పరిణితి చెందుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో వరుస శతకాలు బాదుతూ ముందుకు సాగుతున్నాడు. నిజంగా ప్రతి క్రికెటర్‌కూ కోహ్లీ ఓ గొప్ప ఉదాహరణే. వన్డేల్లో సచిన్‌ను అందుకునే స్థాయికి కోహ్లీ ఎదిగిపోయాడు. సచిన్, కోహ్లీని పోల్చలేం.. ఇద్దరూ పెద్ద ప్లేయర్లే" గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు.

గంగూలీ మాట్లాడుతూ
సచిన్ రికార్డును అధిగమించిన విషయంపై గంగూలీ మాట్లాడుతూ "కోహ్లీ ఓ మాస్టర్. వన్డే క్రికెట్‌లో సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతానికి ఆ దారిలోనే ఉన్నాడు. ఇక్కడ నేను కోహ్లీని సచిన్‌తో పోల్చడం లేదు. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతని నిలకడ, శ్రద్ధ ఎంతో అమోఘం. ఇప్పుడు అతనిని ఆపలేము. ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టాడంటే, మొదటిసారి మైదానంలోకి వచ్చాడేమో అనిపిస్తుంది" అని గంగూలీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications