దెబ్బ కొట్టిన జోసెఫ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. రోహిత్ 13 (3 ఫోర్లు) పరుగులు చేయగా, కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆఫ్‌సైడ్‌గా వచ్చిన బంతిని ఆడే క్రమంలో క్యాచ్ రూపంలో వికెట్ కీపర్ షాయ్ హోప్‌కు విరాట్ కోహ్లీ దొరికిపోయాడు. ఆ కాసేపటికే 10 (ఒక సిక్స్) పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను ఓడియన్ స్మిత్ ఫెమిలియన్ పంపాడు. దీంతో ఇండియా 9.3 ఓవర్లలో 42 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న శ్రేయస్, పంత్
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 110 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయ్యర్‌కు కెరీర్లో ఇది తొమ్మిదో హాఫ్ సెంచరీ కాగా, పంత్‌కు ఐదవది. ఈ భాగస్వామ్యాన్ని హేడెన్ వాల్ష్ విడదీశాడు. జట్టు స్కోర్ 152 పరుగుల వద్ద ఉండగా.. 54 బంతుల్లో 56 పరుగులు ( 6 ఫోర్లు, ఒక సిక్స్) చేసిన రిషబ్ పంత్‌ను హేడెన్ వాల్ష్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులకే ఔటవడంతో 164 పరుగులకు టీమిండియా ఐదో వికెట్లు కోల్పోయింది.
దీపక్, సుందర్ మెరుపులు
జట్టు స్కోర్ 187 పరుగుల వద్ద ఉండగా 80 పరుగులు (111 బంతులు, 9 ఫోర్లు) చేసిన శ్రేయస్ అయ్యర్.. హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, బ్రావోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియా 187 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 4 ఫోర్లు, 2 సిక్సులతో 38 బంతుల్లో 38 పరుగులతో మెరుపులు మెరిపించిన దీపక్ చాహర్.. హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో టీమిండియా 240 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.
కరేబియన్ల లక్ష్యం ఇదిగో
జట్టు స్కోర్ 48వ ఓవర్‌లో 250 పరుగులకు చేరుకోగానే 5 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ 8వ వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో ఓ సిక్సు, ఫోర్ కొట్టి వాషింగ్టన్ సుందర్ స్కోర్‌ణు 260 పరుగులు దాటించాడు. అయితే చివరి ఓవర్‌లో హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సుందర్ (34 బంతుల్లో 33 పరుగులు.. 2 ఫోర్లు, ఒక సిక్సు) 9వ వికెట్‌గా ఔట్ అయ్యాడు. చివర్లో ఓ ఫోర్లు బాదిన సిరాజ్ ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ ముందు 266 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. ఓడియన్ స్మిత్, ఫైబన్ తలో వికెట్ తీశారు. విండీస్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 20 పరుగులు సమర్పించుకున్నారు.


Click it and Unblock the Notifications












