Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కండబలం చూపించారు: జిమ్‌లో కోహ్లీ సేన కసరత్తులు (వీడియో)

హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్‌లో భాగంగా కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. జూన్ 30న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. మూడో వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఆంటిగ్వాకు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, యువరాజ్ సింగ్‌లు జిమ్‌ సెషన్‌లో పాల్గొన్నారు.

India Vs West Indies: Shikhar Dhawan trains at gym with Hardik Pandya and Virat Kohli, shares video

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్న శిఖర్ ధావన్ ఆటగాళ్లు జిమ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఇనిస్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ట్రైనింగ్‌ సెషన్‌ ఎంతో సరదాగా గడిచింది' అని ఆ వీడియోకి ధావన్‌ క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు.

ఈ వీడియోలో ఫిట్‌నెస్‌ సెషన్‌లో భాగంగా ఆటగాళ్లు జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు. ధావన్‌ డంబెల్స్‌తో సాధన చేస్తుండగా, కెప్టెన్ కోహ్లీ ఫిట్‌నెస్‌ కోచ్ శంకర్‌ బసు నుంచి సలహాలు తీసుకుంటూ కనిపించాడు.

ఇదిలా ఉంటే హార్దిక్‌ పాండ్యా కూడా ఓ ఫొటోను అభిమానులతో పంచుకుని 'జట్టు మొత్తానికి జిమ్‌ కల్చర్‌ ఎంతో ఇష్టం' అని పేర్కొన్నాడు. పాండ్యా పోస్టు చేసిన ఫోటోలో శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, పేసర్ భువనేశ్వర్ కుమార్‌లు కండ బలం చూపిస్తూ ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+