పదేళ్ల క్రితం పృథ్వీ షా నన్ను కలిశాడు: ప్రశంసల వర్షం కురిపించిన సచిన్

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో ముగిసిన తొలి టెస్టులో సెంచరీ సాధించడంతో అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కేవలం ఒకే ఇన్నింగ్స్‌తో షాను భారత దిగ్గజ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌లతో పోలిక తేస్తుండగం గమనార్హం.
స్కూల్ డేస్‌లో రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 546 పరుగులు.. రంజీ క్రికెట్, దులీప్ ట్రోఫీలలో సెంచరీ చేయడంతో అందరి దృష్టి పృథ్వీ షాపై పడింది. మంచి పుట్‌వర్క్, టెక్నిక్ కలిగిన పృథ్వీ షాను క్రికెట్ విశ్లేషకులు సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతున్నారు. పృథ్వీ షా టెక్నిక్ సైతం సచిన్‌ను పోలి ఉండటం విశేషం.
దీంతో క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు టీమిండియాకు మరో సచిన్ దొరికాడని సంతోష పడుతున్నారు. అయితే, పృథ్వీ షా టీమిండియాకు ఆడతాడని పదేళ్ల కిందటే తాను ఊహించానని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. తాజాగా పృథ్వీషా గురించి సచిన్ టెండూల్కర్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం
"అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం ఏ క్రికెటర్‌కైనా దానికి మించిన కెరీర్ ఆరంభం, ఉపశమనం ఇంకొకటి ఉండదు. ఇక నుంచి అతను మరింత ఫ్రీగా ఆడగలడు. స్కూలు క్రికెట్, రంజీలు, ఇతరత్రా ట్రోఫీల్లో రాణించే ఈ కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఆడతాడన్న దానిపై కాస్త ఉత్కంఠ ఉండేది. ఈ ప్రశ్నలన్నింటికీ పృథ్వీ షా తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు" అని అన్నాడు.

పదేళ్ల క్రితం నా స్నేహితుడి ద్వారా షా నన్ను కలిశాడు
"పదేళ్ల క్రితం నా స్నేహితుడి ద్వారా షా నన్ను కలిశాడు. చాలా చిన్న వయసులోనే తన ఆటతీరును నాకు వివరించి, సూచనలు అడిగి తెలుసుకున్నాడు. కానీ, షా అతడి ఆట గురించి వివరిస్తూ, సూచనలు అడిగి తెలుసుకున్న విధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కుర్రాడు కచ్చితంగా ఏదో ఓ రోజు టీమిండియాకు ఆడతాడని చెప్పా"అని సచిన్ అన్నాడు.

నా మాటలు గుర్తుపెట్టుకో అన్నాను
"ఆ సత్తా అతడిలో ఉందని చెప్పా. నిజంగానా అని చవాన్ అడిగితే.. నా మాటలు గుర్తుపెట్టుకో అన్నాను. సరిగ్గా పదేళ్ల కిందట నా స్నేహితుడికి చెప్పిన మాటను నిజం చేశాడు పృథ్వీ షా. ఇక ప్రతి ఒక్క ఆటగాడికి ప్రతిభ ఉంటుంది. కానీ దానిని సరైన రీతిలో, అవకాశాలకు తగ్గట్లుగా ఉపయోగించుకోవాలి" అని సచిన్ తెలిపాడు.

ప్రతీ ఆటగాడు నిత్య విద్యార్థిలా ఉండాలి
"ప్రతీ ఆటగాడు నిత్య విద్యార్థిలా ఉండాలి అదేవిధంగా త్వరగా నేర్చుకునే తత్వం ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం షాలో ఎక్కువగానే ఉంది. ఆ వయసులోనే ఎంతో ట్యాలెంట్, బ్యాటింగ్‌లో సమన్వయం, లైన్ అండ్ లెంగ్త్ పట్ల ఉన్న అవగాహను చూసి షాక్ అయ్యా. దీంతో అతను విదేశాల్లో కూడా రాణించగలడు" షాపై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు వర్షం కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications