న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: కోహ్లీ మూడేళ్ల ఆధిపత్యానికి రోహిత్ శర్మ చెక్ పెడతాడా?

IND vs WI 2019 : Rohit Sharma Threatens Virat Kohli's 3-Year Domination ! || Oneindia Telugu
India vs West Indies: Rohit Sharma threatens Virat Kohlis 3-year domination

హైదరాబాద్: డిసెంబర్ 6(శుక్రవారం)న హైదరాబాద్‌ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ప్రారంభమయ్యే తొలి టీ20తో కోహ్లీసేన తన టీ20 వరల్డ్‌కప్ సన్నాహాలను తిరిగి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండిస్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

గత మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లను కలుపుకుని అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి(అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో) 2,183 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ద్రవిడ్ సర్ ఇచ్చిన ఆ ఒక్క సలహాతోనే: 17 ఏళ్ల యశస్వి జైస్వాల్‌ద్రవిడ్ సర్ ఇచ్చిన ఆ ఒక్క సలహాతోనే: 17 ఏళ్ల యశస్వి జైస్వాల్‌

కోహ్లీ vs రోహిత్ శర్మ

కోహ్లీ vs రోహిత్ శర్మ

అయితే, ఇప్పుడు విరాట్ కోహ్లీకి తన సహచర ఆటగాడు రోహిత్‌ శర్మ నుంచే తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఈ ఏడాది మూడు ఫార్మాట్లు కలిసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(2,090) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్‌ అజామ్‌(1820) మూడో స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ అధిగమించే అవకాశం

రోహిత్ శర్మ అధిగమించే అవకాశం

దీంతో కోహ్లీకి రోహిత్ శర్మల మధ్య పరుగుల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో కోహ్లీని ఈ ఏడాది రోహిత్ శర్మ అధిగమించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ ఏడాది టీమిండియా ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు ఆరు ఉన్నాయి. ఈ ఆరు మ్యాచ్‌లు కూడా సొంతగడ్డపైనే కావడం విశేషం.

వరుసగా 4వ ఏడాది

వరుసగా 4వ ఏడాది

ఒకటి మూడు టీ20 సిరీస్‌ అయితే, ఇంకొటి మూడు వన్డేల సిరీస్‌. ఈ సిరిస్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో రాణిస్తే వరుసగా 4వ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. టీ20ల్లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ సక్సెస్‌ అయితే కోహ్లీకి పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ రోహిత్ విఫలమైతే, కోహ్లీ రాణించే అవకాశముంది.

2019లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా!

2019లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా!

దీంతో విండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ విఫలమై... రోహిత్‌ శర్మ రాణిస్తే 2019లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. 2016లో 2,595 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీ ఆ తర్వాత 2017లో 2,818 పరుగులు... 2018లో 2,735 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.

Story first published: Friday, December 6, 2019, 12:41 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X