Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. రోహిత్ పోటీ!!

India vs West Indies: Rohit Sharma threat looms large as Virat Kohli eyes massive world record

చెన్నై: ఈ ఏడాది టీమిండియా టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ దుమ్మురేపుతున్నారు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా భారీ స్కోర్ల‌తో హ‌డలెత్తిస్తున్నారు. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ క‌ళ్లు చెదిరే షాట్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోస్తున్నారు. నువ్వానేనా అన్న‌ట్టుగా ఆ ఇద్ద‌రూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు చేరువ అయ్యాడు.

 రోహిత్ పోటీ

రోహిత్ పోటీ

ఈ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిస్తే.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. అత్యధిక పరుగులు చేస్తే.. వరుసగా మూడు సంవత్సరాలుగా వన్డేల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కుతాడు. 2011, 2017, 2018లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అయితే కోహ్లీకి టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నుంచి గట్టి పోటీ ఉంది.

వన్డేల్లో అత్యధిక పరుగులు:

వన్డేల్లో అత్యధిక పరుగులు:

ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (1288 పరుగులు, 23 మ్యాచుల్లో), రోహిత్ (1232 పరుగులు, 25 మ్యాచుల్లో), ఆరోన్ ఫించ్ (1141 పరుగులు, 23 మ్యాచుల్లో), షై హోప్‌ (1123 పరుగులు, 25 మ్యాచుల్లో) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక కోహ్లీ కంటే రోహిత్‌ కేవలం 56 పరుగులే వెనక ఉండడంతో.. విరాట్‌ ఈ రికార్డు సాధిస్తాడా లేదో చూడాలి.

మరో రికార్డుపై కన్ను:

మరో రికార్డుపై కన్ను:

విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కూడా కన్నేశాడు. ఈ ఏడాదిలో అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలుస్తున్నాడు. ఈ ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ (2,366 పరుగులు), రోహిత్‌ (2,184 పరుగులు), బాబర్‌ అజామ్‌ (1820) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌లో కూడా కోహ్లీ చెలరేగితే.. ఈ రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. గత రెండు సంవత్సరాలుగా కోహ్లీననే అత్యధిక పరుగులు సాధించాడు.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో భారత్ ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడనుంది.

టీ20ల్లో ఎవ‌రు బెస్ట్‌:

టీ20ల్లో ఎవ‌రు బెస్ట్‌:

తాజాగా వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఈ ఇద్దరు విండీస్ బౌల‌ర్ల‌ను చీల్చిచెండారు. ఒక‌ర్ని మించి ఒక‌రు భారీ షాట్ల‌తో ఆక‌ట్టుకున్నారు. కోహ్లీ టీ20ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2633 ర‌న్స్ చేశాడు. ఓపెన‌ర్ రోహిత్ కూడా టీ20ల్లో 2633 ప‌రుగులే చేశాడు. అయితే విరాట్ కేవ‌లం 70 ఇన్నింగ్స్‌లో ఆ స్కోర్ చేయ‌గా.. రోహిత్ మాత్రం 96 ఇన్నింగ్స్‌లో ఆ స్కోర్ చేశాడు.

Story first published: Sunday, December 15, 2019, 12:45 [IST]
Other articles published on Dec 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+