Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఫ‌స్ట్ టీ20లో రోహిత్‌, ర‌వి బిష్ణోయ్ రికార్డుల మోత‌.. మొత్తంగా న‌మోదైన‌ రికార్డులు ఇదిగో!

India vs West Indies: Rohit Sharma, Ravi Bishnoi records and many other records were recorded in the First T20.
IND vs WI 1st T20 : IPL కుర్రాళ్ళ జోరు India Lead Series 1-0 |Ravi Bishnoi | Oneindia Telugu

కోల్‌క‌తా: వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. క‌రేబియ్ల‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేయ‌గా.. భార‌త్ 4 వికెట్లు కోల్పోయి మ‌రో 7 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని చేధించింది. టీమిండియా అరంగేంట్ర లెగ్ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు న‌మోద‌య్యాయి.

 రోహిత్ రికార్డులు

రోహిత్ రికార్డులు

తొలి టీ20 మ్యాచ్ ద్వారా భార‌త కెప్టెన్ రోహిత శ‌ర్మ అనేక రికార్డుల‌ను అందుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 120 మ్యాచ్‌లు ఆడిన బ్యాట‌ర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. అత‌ని కంటే ముందు పాకిస్థాన్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ 124 మ్యాచ్‌ల‌తో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా నిలిచాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించారు. 559 ప‌రుగులు చేసి బాబ‌ర్ అజామ్‌(540)ను అధిగ‌మించాడు. ఈ క్ర‌మంలో ఓ జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఐదో బ్యాట‌ర్‌గా నిలిచాడు.

 అత్య‌ధిక సిక్సులు

అత్య‌ధిక సిక్సులు

అలాగే ఓపెన‌ర్‌గా రోహిత్ శ‌ర్మ వెస్టిండీస్‌పై 528 ప‌రుగులు చేశాడు. దీంతో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓపెన‌ర్‌గా ఓ జ‌ట్టుపై ఎక్కువ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో డేవిడ్ వార్న‌ర్‌(512) అధిగ‌మించాడు. అలాగే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై 32 సిక్సులు బాదిప‌ హిట్‌మ్యాన్ ఈ క్ర‌మంలో ఓ జ‌ట్టుపై అత్య‌ధిక సిక్సులు బాదిన రెండో బ్యాట‌ర్‌గా నిలిచాడు. భార‌త్‌లో జ‌రిగిన టీ20ల‌లో అత్య‌ధిక టాస్‌లు గెలిచిన టీమిండియా కెప్టెన్‌గా ధోని, కోహ్లీ స‌ర‌స‌న రోహిత్ చేరాడు. వీరు ఇప్ప‌టివ‌ర‌కు 7 సార్లు టాస్ గెలిచారు.

 ర‌వి బిష్ణోయ్ రికార్డులు

ర‌వి బిష్ణోయ్ రికార్డులు

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగేంట్రం చేసిన ఆరో పిన్న వయ‌స్సుడిగా ర‌వి బిష్ణోయ్ నిలిచాడు. ర‌వి బిష్ణోయ్ వ‌య‌సు 21 సంవ‌త్స‌రాల‌ 164 రోజులుగా ఉంది. టీ20 క్రికెట్‌లో అరంగేంట్ర మ్యాచ్‌లోనే ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొమ్మిదో భార‌త ఆట‌గాడిగా ర‌వి బిష్ణోయ్ నిలిచాడు. అలాగే అరంగేంట్రంలోనే అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన ఐదో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ఇక భార‌త్‌లో అరంగేంట్రం చేసి అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మెదు చేసిన రెండోడో భార‌త బౌల‌ర్‌గా ర‌వి బిష్ణోయ్ నిలిచాడు.

 కోహ్లీ, పూర‌న్ రికార్డులు

కోహ్లీ, పూర‌న్ రికార్డులు

తొలి టీ20 మ్యాచ్‌తో నికోల‌స్ పూర‌న్ ఈ ఫార్మాట్‌లో 100 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. అలాగే టీ20ల‌లో నాల్గో అత్యుత్త‌మ స్కోర్‌ను న‌మోదు చేశాడు. భార‌త్‌పై అత‌నికిదే అత్యుత్త‌మ స్కోర్‌. టీ20ల్లో విరాట్ కోహ్లీ 43 క్యాచ్‌ల‌తో సురేష్ రైనాను అధిగ‌మించాడు. ఈ క్ర‌మంలో అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టిన మూడో భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. ఇక టీ20ల్లో టీమిండియా వ‌రుస‌గా ఏడు విజ‌యాల‌ను న‌మోదు చేసింది. అలాగే వెస్టిండీస్‌తో 2018 నుంచి ఆడిన 10 టీ20ల్లో భార‌త్ ఏకంగా 9 గెలిచింది. తొలి టీ20ల్లో 40 బంతులు 83 స్ట్రైక్‌రేట్‌తో 35 ప‌రుగులే చేసిన ఇషాన్ కిష‌న్.. ఈ క్ర‌మంలో అత్య‌ల్ప స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన భార‌త ఆట‌గాడిగా నిలిచాడు.

Story first published: Thursday, February 17, 2022, 11:22 [IST]
Other articles published on Feb 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+