For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma: త‌గ్గెదేలే! హిట్‌మ్యాన్ సూప‌ర్ ఫామ్‌.. వ‌రుస‌గా 7 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్కోర్లు

India vs West Indies: Rohit Sharma last 7 T20 matches with 51 average 359 runs

టీమిండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ టీ20 ఫార్మాట్‌లో సూప‌ర్ ఫామ్‌తో చెల‌రేగుతున్నాడు. గ‌త 7 టీ20 మ్యాచ్‌ల్లో ప్ర‌తి మ్యాచ్‌లో క‌నీసం 30కి పైగా ప‌రుగులు సాధించాడు. స‌గ‌టు 51గా ఉంది. అంటే హిట్‌మ్యాన్ ఏ రేంజులో చెల‌రేగుతున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌త 7 టీ20 మ్యాచ్‌ల వారీగా చూస్తే రోహిత్ స్కోర్లు 74, 30, 56, 48, 55, 56, 40 ప‌రుగులు చేశాడు. మొత్తంగా 359 ప‌రుగులు చేశాడు. కాగా కెప్టెన్‌గా ప్ర‌మెష‌న్ పొందాక రోహిత్ మ‌రింత బాధ్య‌త‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ శ‌ర్మ టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా ప్రమోష‌న్ పొందాక భార‌త జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇక కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ 33 స‌గ‌టుతో 3,237 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో 288 ఫోర్లు, 153 సిక్స్‌లు కూడా బాదాడు.

ఇక కోల్‌క‌తా వేదికగా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ అనేక రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 120 మ్యాచ్‌లు ఆడిన బ్యాట‌ర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించారు. వెస్టిండీస్‌పై రోహిత్ ఇప్ప‌టివ‌ర‌కు 559 ప‌రుగులు సాధించాడు. అలాగే ఓపెన‌ర్‌గా రోహిత్ శ‌ర్మ వెస్టిండీస్‌పై 528 ప‌రుగులు చేశాడు. దీంతో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓపెన‌ర్‌గా ఓ జ‌ట్టుపై ఎక్కువ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు.

టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్య‌ధిక సిక్సులు బాదిన బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. విండీస్‌పై హిట్‌మ్యాన్ ఇప్ప‌టివ‌ర‌కు 32 సిక్సులు కొట్టాడు. భార‌త్‌లో జ‌రిగిన టీ20ల‌లో అత్య‌ధిక టాస్‌లు గెలిచిన టీమిండియా కెప్టెన్‌గా ధోని, కోహ్లీ స‌ర‌స‌న రోహిత్ చేరాడు. వీరు ఇప్ప‌టివ‌ర‌కు 7 సార్లు టాస్ గెలిచారు. కాగా ఇప్ప‌టికే టీమిండియా వ‌న్డే, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉన్న‌ రోహిత్ శ‌ర్మ‌ను త్వ‌ర‌లోనే టెస్ట్ ఫార్మాట్‌కు కూడా కెప్టెన్‌గా ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ మేర‌కు బీసీసీఐ శ్రీ‌లంక‌తో టెస్టు సిరీస్‌కు ముందు అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

Story first published: Thursday, February 17, 2022, 14:19 [IST]
Other articles published on Feb 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+