విండిస్‌తో వన్డే సిరిస్: కోహ్లీకి విశ్రాంతి, పంత్‌కు పిలుపు?

హైదరాబాద్: టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వన్డేల్లోనూ అరంగేట్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వెస్టిండిస్ జట్టుతో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరిస్‌కు గురువారం టీమిండియాను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌కు వన్డే జట్టులో చోటు దక్కనుందా? అంటే అవుననే అంటున్నారు.

ధోని తన స్థాయికి తగినట్లు బ్యాటింగ్ చేయకపోవడం వల్లే
ఈ అంశంపై గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల కాలంలో ధోని తన స్థాయికి తగినట్లు బ్యాటింగ్ చేయలేకపోతుండటంతో కొత్త ఫినిషర్‌ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిరంగా మారింది.

బ్యాకప్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు
దినేశ్ కార్తీక్ రూపంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రత్యమ్నాయ వికెట్‌కీపర్ జట్టులో ఉన్నప్పటికీ.. అతడు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది తక్కువే. బ్యాకప్ కీపర్‌గా అతడి స్థానంలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. విండిస్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశం?
కోహ్లీకి విశ్రాంతి ఇస్తే జట్టులో కొన్ని మార్పులు తప్పేలా లేదు. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. కేదార్ జాదవ్ గాయం బారిన పడటంతో మిడిలార్డర్‌లో అతడి స్థానం ఖాళీ అయింది. దీంతో మరో ఆటగాడిని తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు మనీష్ పాండేకి చోటు దక్కడం కష్టమేనని అంటున్నారు.

వన్డే జట్టులోకి రానున్న భువనేశ్వర్, బుమ్రా
దీంతో అతడి స్థానంలో జడేజా చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. ఇటీవలే దుబాయి వేదికగా ముగిసిన ఆసియా కప్‌లో సైతం రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి పొందిన భువనేశ్వర్, బుమ్రా వన్డే జట్టులోకి రానున్నారు. మొదటి మూడు వన్డేలకు జట్టును ప్రకటిస్తారా? లేక మొత్తం సిరీస్‌కు ఒకేసారి ప్రకటిస్తారా? అనేది కూడా తేలియాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications