India Vs West Indies: జడేజా కెరీర్, టీ20ల్లో టీమిండియా ర్యాంకుపై విరాట్ కోహ్లీ

హైదరాబాద్: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రసంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం జడేజా తన కెరీర్లో ఉత్తమ దశను అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టీ20 నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శక్రవారం జరగనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "తన కెరీర్‌లోనే జడేజా ప్రస్తుతం అత్యుత్తమ బ్యాటింగ్ ఫామ్‌ని కలిగి ఉన్నాడు. ఆల్ రౌండర్‌గా ఇది అతడి ఉత్తమ దశ, మేము దానిని మరింతగా పెంచాలని అనుకుంటున్నాం" అని అన్నాడు.

టీ20ల్లో ప్రయోగాలు కొనసాగుతాయి
వరల్డ్‌కప్‌కు ముందు టీ20ల్లో ప్రయోగాలు కొనసాగుతాయని కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో ఈ ఫార్మాట్‌లో ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పాడు. టీ20ల్లో తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు.

టీమిండియా బ్యాటింగ్‌పై
"‘తొలి ఇన్నింగ్సుల్లో మేము అంతబాగా బ్యాటింగ్ చేస్తున్నామని అనుకోవడం లేదు. తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో విఫలమవుతున్నాం. ఈ ఫార్మాట్‌లో టీమిండియా ర్యాంకు మెరుగవ్వాలంటే రెండు అంశాలపై మేం ప్రత్యేక దృష్టి సారించాలి. టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20ల్లో ప్రయోగాలు ఎక్కువ. ఆ ప్రకారంగా ఎక్కువ రిస్క్ చేస్తున్నాం. యువకులకు బాగా అవకాశాలు ఇస్తున్నాం" అని కోహ్లీ అన్నాడు.

మా ర్యాంకుని పట్టించుకోవద్దు
"టీ20ల్లో మా ర్యాంకుని పట్టించుకోవద్దు. ర్యాంకులనేవి అత్యుత్తమ 11మందిని ప్రతిబింబిస్తాయి. టీమిండియా చాలాసార్లు అత్యుత్తమ 11మందితో బరిలోకి దిగడం లేదు. టీ20ల్లో ర్యాంకులతో పన్లేదు. ఎవ్వరైనా ప్రపంచకప్ గెలవొచ్చు. మా తుది జట్టు రూపు దిద్దుకుంటోంది. టీ20ల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు" అని కోహ్లీ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాలో మైదానాలు చాలా పెద్దవి
"ఆస్ట్రేలియాలో మైదానాలు చాలా పెద్దవి. మణికట్టు స్పిన్నర్లు కీలకం అవుతారు. కొన్ని మ్యాచుల్లో కుల్దీప్, చాహల్ ఇద్దరూ ఆడొచ్చు. ఏదేమైనా సమతూకం ముఖ్యం. జడేజా, సుందర్ వంటి స్పిన్నర్లతో మా బౌలింగ్ దాడిలో వైవిధ్యం పెరుగుతుంది. టీ20 వరల్డ్‌కప్ సమయానికి సమతూకాన్ని సృష్టించడమే అత్యంత ముఖ్యం" అని కోహ్లీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications