టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు: ఇది మా అమ్మకు అంకితం: జడేజా (వీడియో)


హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో జడేజా సెంచరీని నమోదు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో జడేజాకి ఇదే తొలి సెంచరీ. అంతకు ముందు ఇంగ్లాండ్‌పై చేసిన 86, 90 మాత్రమే టెస్టుల్లో జడేజా అత్యధిక పరుగులు.
విండీస్ జరుగుతున్న తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనూ 90 పరుగుల వద్ద ఆందోళనను అధిగమించి జడేజా ఈ సెంచరీని సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో తనకెంతో ప్రత్యేకమైన తన తొలి టెస్టు సెంచరీని తన తల్లికి అంకితమిచ్చాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన సమావేశంలో జడేజా మాట్లాడాడు.
టీమిండియాకు ఆడాలనేది మా అమ్మ కల
"నేను టీమిండియాకు ఆడాలనేది మా అమ్మ కల. నేను జట్టులో స్థానం దక్కించుకునే సమయానికి తను నాతో లేదు... మా అమ్మ ఇప్పుడు నాతో లేకపోయినా, ఆమె దీవెనలు ఎప్పుడూ నావెంటే ఉంటాయి. అందుకే నా సెంచరీని అమ్మకి అంకితం ఇస్తున్నా" అంటూ భావోద్వేగతంతో జడేజా చెప్పాడు. 37వ టెస్టులో జడేజా తొలి సెంచరీ చేయడం గమనార్హం.
ఇది నాకు చాలా ప్రత్యేకం
"ఇది నాకు చాలా ప్రత్యేకం. అంతకు ముందు 80, 90 పరుగులు చేసినా వాటిని సెంచరీలుగా మలచలేకపోయా. ఈ రోజు ఆందోళన పడలేదు. ఎలాంటి చెత్త షాట్ ఆడాలని అనుకోలేదు. ఉమేశ్, షమితో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. సెంచరీ సాధించే వరకు క్రీజులో ఉండాలని నాకు నేను చెప్పుకొన్నా" అని జడేజా అన్నాడు.
హెట్‌మెయిర్ రనౌట్ గురించి జడేజా ఇలా
హెట్‌మెయిర్ రనౌట్ గురించి కూడా జడేజా స్పందించాడు. "ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే ఎండ్‌లో ఉండటం చూశాను. ఉత్కంఠ పరిస్థితుల్లో అతడు మళ్లీ వెనక్కి పరుగు తీస్తాడని అనుకోలేదు. అందుకే నడుచుకుంటూ వచ్చి బెయిల్స్ కొడదామనుకున్నా. కానీ అతడు బాగా పరుగెత్తాడు" అని జడేజా ఆ ఫన్నీ సన్నివేశం గురించి చెప్పాడు.
ఏడాది ఎక్కువ క్రికెట్ ఆడలేదు
ఈ ఏడాది తాను ఎక్కువ క్రికెట్ ఆడలేదని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసేకోవడమే తన పనిగా పేర్కొన్నాడు. అందుకే ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటానని జడేజా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications