కార్న్‌వాల్ అరంగేట్రం: చరిత్ర పుటల్లోకి ఎక్కిన భారత్-విండిస్ రెండో టెస్టు

హైదరాబాద్: భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన కింగ్‌స్టన్ టెస్టు చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ టెస్టులో విండీస్ భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ అరంగేట్రం చేసేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (133-139 కిలోలు) రికార్డును బద్దలు కొడుతూ టెస్టు క్రికెట్ ఆడిన అత్యంత బరువైన క్రికెటర్‌గా నిలిచాడు.

తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన
ఈ సిరీస్‌తో తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన 26 ఏళ్ల కార్న్‌వాల్‌కు రెండో టెస్టులో బరిలోకి దిగాడు. ఎత్తు ఆరున్నర అడుగులు. బరువు 140 కిలోలు. కమిన్స్ స్థానంతో చోటు దక్కించుకున్న రకీమ్ కార్న్‌వాల్ తన తొలి టెస్టులోనే అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో మంచి బౌన్స్ రాబట్టిన కార్న్‌వాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

పుజారాను ఔట్ చేయడం ద్వారా
తన తొలి అంతర్జాతీయవికెట్‌ను సాధించాడు. కార్న్‌వాల్ వేసిన బంతిని ఆడిన పుజారా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండో సెషన్‌లో మయాంక్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా అతడే అందుకున్నాడు. భారీ సిక్స్‌లు కొట్టగల కార్న్‌వాల్.. ఇటీవలి కాలంలో విండీస్ దేశవాళీ క్రికెట్లో చాలా నిలకడగా రాణించాడు.

55 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 260 పడగొట్టిన కార్న్‌వాల్
2018-19 వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్స్‌లో 17.68 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 55 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 260 పడగొట్టిన కార్న్‌వాల్.. 2224 పరుగులు సాధించాడు. గతంలో అత్యంత బరువున్న క్రికెటర్‌గా బెర్ముడా ప్లేయర్ చరిత్ర సృష్టించాడు. డ్వెయిన్ లెవర్‌రాక్ 2007 వరల్డ్‌కప్‌లో ఆడాడు. ఆ సమయంలో అతను 127 కిలోలు ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications