Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ జట్టులో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నా: ట్విట్టర్‌లో కోహ్లీ

India vs West Indies: Proud to be part of this dedicated team, says Virat Kohli after series win

హైదరాబాద్: వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్‌ను భారత్ ఘనంగా ముగించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌ 9 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-1తేడాతో సొంతం చేసుకుంది. ఈ విజయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ప్రత్యేకంగా స్పందించాడు.

"సిరీస్‌ విజయం కోసం టీమిండియా ఆటగాళ్లు గొప్ప కృషి చేశారు. అంకితభావంతో పనిచేసే ఇలాంటి జట్టులో ఉన్నందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను" అని కోహ్లీ మ్యాచ్‌ అనంతరం ట్విటర్‌లో పేర్కొన్నాడు. వెస్టిండిస్ నిర్దేశించిన 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా

ఒక మ్యాచ్‌ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో రికార్డు స్థాయిలో విండీస్‌ జట్టుపై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్ విజయాన్ని, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్‌ను కోహ్లీసేన నెగ్గడం విశేషం. భారత్‌ చివరిసారి 2015లో సొంతగడ్డపై వన్డే సిరిస్‌ను చేజార్చుకుంది. ఆఖరి వన్డేలో భారీ విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పలువురు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రవీంద్ర జడేజా

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రవీంద్ర జడేజా

ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కెప్టెన్ కోహ్లీ గెలుచుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 6 పరుగులకే పెవిలియన్‌కు చేరగా, రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు.

ఆఖరి వన్డేలో 200వ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ

ఆఖరి వన్డేలో 200వ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ

కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు చేశాడు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 104 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో 200వ సిక్సర్‌ బాదాడు. కేవలం 187 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. అంతేకాదు వెస్టిండీస్‌పై ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు 360 చేసిన రెండో భారత ఆటగాడిగా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ 444 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Friday, November 2, 2018, 13:12 [IST]
Other articles published on Nov 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+