For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs వెస్టిండిస్: 'పృథ్వీ షా షాట్లు చాలా కళాత్మకంగా ఉన్నాయి'

India vs West Indies: Prithvi Shaw showed maturity, says Dilip Vengsarkar

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించిన పృథ్వీషాపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అంతగా అనుభవం లేకపోయినా.. పృథ్వీషా తొలి మ్యాచ్‌లో మంచి పరిణతి కనబరిచాడని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నాడు. తన అరంగేట్ర టెస్టులోనే పృథ్వీ షా సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ "పృథ్వీషా ఆటను ఇంతకుముందే చూశాం. కానీ విండీస్‌తో తొలి రోజు ఆటలో మాత్రం అతను పరిణతి ప్రదర్శించాడు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా ఆడిన షాట్లు చాలా కళాత్మకంగా ఉన్నాయి. 18ఏళ్ల వయసులో ఇలా ఆడటం చాలా అరుదు" అని దిలీప్ వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.

1
44264
అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు

అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు

"గత కొన్నేళ్లుగా దేశవాళీ, భారత్ ఎ తరఫున ప్రాతినిధ్యం వహించడం వల్ల అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరైన సమయంలో అందివచ్చిన అవకాశాన్ని షా చక్కగా వినియోగించుకున్నాడు. విండీస్‌తో మొదటి రోజు ఆటలో వికెట్‌కు రెండు వైపులా చక్కటి టైమింగ్‌తో షాట్లు ఆడాడు. ముఖ్యంగా బ్యాక్‌ఫుట్ షాట్లు కళ్లకు ఇంపుగా అనిపించాయి" అని వెంగ్‌సర్కార్ అన్నాడు.

 99 బంతుల్లో సెంచరీ

99 బంతుల్లో సెంచరీ

వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఓపెనర్ పృథ్వీషా 99 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర టెస్టులో సెంచరీతో భారత్ తరుపున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీషా 154 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 134 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవేంద్ర బిషు బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా

ఫలితంగా భారత్ తరుపున అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా పృథ్వీషా నిలిచాడు. ఈ జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్(187) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించాడు. అదే ఏడాది ఓపెనర్ రోహిత్ శర్మ సైతం కోల్‌కతా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో 177 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

 భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్

భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్

ఇక, మూడో స్థానంలో మాజీ క్రికెట్ దిగ్గజం గుండప్ప విశ్వనాథ్ (137) ఉన్నాడు. 1969లో కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గుండప్ప విశ్వనాథ్ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పృథ్వీషా అనేక రికార్డులు నమోదు చేశాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన నాలుగో అతి చిన్న వయసు బ్యాట్స్‌మన్. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్.

రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచుల్లోనూ సెంచరీలు

రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచుల్లోనూ సెంచరీలు

సచిన్ (17 ఏళ్ల 112 రోజులు) తర్వాత టెస్టుల్లో సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్. గతంలో శిఖర్ ధావన్ (85), డ్వేన్ స్మిత్ (93) ఈ ఘనత సాధించారు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన పృథ్వీ షా... ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.

Story first published: Saturday, October 6, 2018, 10:43 [IST]
Other articles published on Oct 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+