టెస్టుల్లో ఖాయమైన పృథ్వీషా అరంగేట్రం: సిరాజ్, విహారీలకు నో ప్లేస్

హైదరాబాద్: గురువారం నుంచి రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్ జట్టుతో జరగనున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషా అరంగేట్రం చేయనున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి పృథ్వీషా ఈ టెస్టులో ఓపెనింగ్ జోడీగా పాలుపంచుకోనున్నట్లు జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
తొలి టెస్టుకు సంబంధించి 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాలో పృథ్వీ షా పేరుంది. ఇంగాండ్‌తో ముగిసిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు.
అయితే, ఇంగ్లీషు గడ్డపై పృథ్వీ షాకు ఆడే అవకాశం రాలేదు. మరోవైపు వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, హనుమ విహారీలకు నిరాశే ఎదురైంది. తొలి టెస్టులో ఈ ఇద్దరి ఆటగాళ్లకు తుది జట్టులో చోటుదక్కలేదని తెలుస్తోంది.

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన హనుమ విహారి కూడా బెంచ్‌కే పరిమితమైనట్లు తెలుస్తోంది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ యువ ఆటగాళ్ల ప్రూవ్ చేసుకునేందుకు విండిస్ సిరిస్ ఓ అద్భుత అవకాశమని చెప్పాడు.
ఇదొక గొప్ప అవకాశం
"హనుమ విహారి, పృథ్వీ షా, మయాంక అగర్వాల్ లాంటి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశారు కాబట్టే జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇది వారికి ఓ గొప్ప అవకాశం. సుదీర్ఘ ఫార్మాట్‌లో వారి స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే ఇదొక గొప్ప అవకాశం" అని కోహ్లీ పేర్కొన్నాడు.
విహారికి నిరాశే
ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ఐదో టెస్టులో ఆడిన హనుమ విహారి ఆరో నంబర్ స్థానానికి తగిన ఆటగాడిగా ఆశలు రేపాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో సాధించడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో తన స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇదే అతడిని మళ్లీ జట్టుకు ఎంపికయ్యేలా చేసింది.

రాజ్ కోట్ టెస్టులో సిరాజ్‌కు దక్కని చోటు
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శనతో మరోసారి సెలెక్టర్లను దృష్టిని ఆకర్షించిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కి కూడా రాజ్ కోట్ టెస్టులో చోటు దక్కలేదు. ఈ ఇద్దరి ఆటగాళ్లను అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌కు ఎంపిక చేయాలనే యోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి
రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఐదుగురు బ్యాట్స్‌మెన్లు, ఓ ఆల్ రౌండర్, ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇందులో ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ కాగా, ఇద్దరు పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్ అని తెలిపాడు. లోయర్ ఆర్డర్‌లో జడేజా కీలకపాత్ర పోషిస్తాడని అన్నాడు.
తుది జట్టులో చోటు దక్కించుకున్న పంత్
ఇక, ఇంగ్లీషు గడ్డపై ఆఖరి టెస్టులో సెంచరీతో చెలరేగిన వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సైతం తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌తో ఓపెనింగ్ జోడీపై ఓ క్లారిటీ వస్తుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభించారు.
ప్రాక్టీస్ మొదలెట్టేసిన మయాంక్ అగర్వాల్
ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికార ట్విటర్‌లో పోస్టు చేసింది. ముఖ్యంగా యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోతో పాటు ‘టీమిండియా నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో మయాంక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు' అంటూ ట్వీట్ పెట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications