Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West indies వ‌న్డే పోరులో ఎక్కువ ర‌న్స్ చేసిన బ్యాట‌ర్లు ఎవ‌రో తెలుసా?

India vs West indies One Day Series Most Runs Batters list

ఇండియా, వెస్టిండీస్ వ‌న్డే స‌మ‌రానికి చూస్తుండ‌గానే స‌మ‌యం వ‌చ్చేసింది. స‌రిగ్గా మ‌రో 5 రోజుల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌, విండీస్ వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఇరు జ‌ట్ల వ‌న్డే స‌మ‌రంలో ఎక్కువ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ ఎవ‌ర‌నే చ‌ర్చ మొద‌లైంది. అస‌లు ఎక్కువ ప‌రుగులు ఎవ‌రు చేశారు. ఎన్ని ప‌రుగులు చేశార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

 టాప్‌లో కింగ్ కోహ్లీ

టాప్‌లో కింగ్ కోహ్లీ

ఇండియా, వెస్టిండీస్ వ‌న్డే స‌మ‌రంలో ఎక్కువ‌ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీ మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఇరు జ‌ట్ల వ‌న్డే స‌మ‌రంలో మొత్తం 39 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఏకంగా 72 సగ‌టుతో 2,235 ప‌రుగులు చేశాడు. ఇందులో ఏకంగా 9 సెంచ‌రీలు, 11 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 157 ప‌రుగులు. కోహ్లీ బాగా విజ‌యవంత‌మైన జ‌ట్ల‌లో వెస్టిండీస్ కూడా ఒక‌టి. ఇక ఆ త‌ర్వాతి స్థానంలో భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడు. ఇరు జ‌ట్ల వ‌న్డే స‌మ‌రంలో 39 మ్యాచ్‌లు ఆడిన స‌చిన్‌.. 52 స‌గ‌టుతో 1573 పరుగులు. ఇందులో 4 సెంచ‌రీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 141 ప‌రుగులు.

 విండీస్‌పై హిట్‌మ్యాన్‌కు సూప‌ర్ రికార్డులు

విండీస్‌పై హిట్‌మ్యాన్‌కు సూప‌ర్ రికార్డులు

వెస్టిండీస్‌పై వ‌న్డేల్లో కెప్టెన్ రోహిత్‌శ‌ర్మకు మంచి రికార్డులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు విండీస్‌తో 33 వ‌న్డేలు ఆడిన హిట్‌మ్యాన్ 60 స‌గ‌టుతో 1523 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 సెంచ‌రీలు, 11 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 162 ప‌రుగులు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు తొలి 3 స్థానాల్లో ఉన్న విరాట్ కోహ్లీ, స‌చిన్ టెండూల్క‌ర్, రోహిత్ శ‌ర్మ స‌రిగ్గా 11 హాఫ్ సెంచ‌రీల చొప్పున‌ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక నాలుగో స్థానంలో వెస్టిండీస్ ప్లేయ‌ర్ డీఎల్‌ హేన్స్ ఉన్నాడు. ఇరు జ‌ట్ల స‌మ‌రంలో 36 వ‌న్డేలు ఆడిన హేన్స్ 42 స‌గ‌టుతో 1357 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 సెంచ‌రీలు, 9 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 152 ప‌రుగులు.

 హెడ్ కోచ్ ద్రావిడ్ చేసిన ప‌రుగులు

హెడ్ కోచ్ ద్రావిడ్ చేసిన ప‌రుగులు

ఇక ఈ జాబితాలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐదో స్థానంలో ఉన్నాడు. విండీస్‌పై అత్య‌ధికంగా 40 వ‌న్డేలు ఆడిన ద్రావిడ్ 42 సగ‌టుతో 1348 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 సెంచ‌రీలు, 8 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 109 ప‌రుగులు. వెస్టిండీస్‌పై అత్య‌ధిక వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన రెండో భార‌త బ్యాట‌ర్‌ రాహుల్ ద్రావిడే కావ‌డం గ‌మ‌నార్హం.

 వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌

వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌

భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 6 నుంచి అహ్మ‌దాబాద్ వేదిక‌గా 3 వ‌న్డేల సిరీస్ ప్రారంభంకానుంది. 9న రెండో వ‌న్డే 11న మూడో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. క‌రోనా కార‌ణంగా అన్ని మ్యాచ్‌ల‌ను బీసీసీఐ అహ్మ‌దాబాద్ వేదిక‌గానే నిర్వ‌హిస్తుంది.

Story first published: Monday, January 31, 2022, 14:08 [IST]
Other articles published on Jan 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+