For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ వన్డేల్లో ఎంత పటిష్టమో గణాంకాలే చెబుతున్నయ్!!

India vs West Indies: Numbers reveal India’s biggest strength in ODI cricket

న్యూ ఢిల్లీ: మిడిలార్డర్ కోసం తాపత్రయపడుతున్న టీమిండియాకు టాప్ ఆర్డర్ తప్పించి వేరే ఆదరువేమీ కనిపించడం లేదు. విండీస్‌పై టెస్టు సిరీస్‌లో ఘన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ ఫేవరెట్‌ అని చెప్పక తప్పదు. వన్డేల్లో కోహ్లీ సేనతో పోల్చుకుంటే విండీస్‌ బలహీనమైన జట్టే. అయితే గత కొంతకాలంగా టీమిండియా ప్రదర్శన చూస్తే.. ఏ ఇతర జట్లతో పోల్చుకున్నా భారత్‌ బలంగానే కనిపిస్తుంది.

ఒకటి నుంచి మూడో బ్యాట్స్‌మన్‌ వరకూ

ఒకటి నుంచి మూడో బ్యాట్స్‌మన్‌ వరకూ

భారత్‌కు అతిపెద్ద బలం టాప్‌ ఆర్డరే. టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మ్యాచ్‌పై పట్టుసాధించడమే కాకుండా జట్టుకు విజయాలను అందిస్తున్నారు. 2017 నుంచి గణాంకాలు చూస్తే భారత టాప్‌ ఆర్డర్‌.. ఒకటి నుంచి మూడో బ్యాట్స్‌మన్‌ వరకూ 6939 పరుగులు చేసింది. ఇవి జట్టు ఆటగాళ్లు కొట్టిన మొత్తం పరుగుల్లో 64.15 శాతం. ఏ ఇతర జట్టు టాప్‌ ఆర్డర్‌ కూడా ఇన్ని పరుగులు సాధించలేదు.

భారత్..‌ ఇంగ్లాండ్‌ తర్వాత రెండోస్థానంలో

భారత్..‌ ఇంగ్లాండ్‌ తర్వాత రెండోస్థానంలో

2017 నుంచి భారత్‌ 44 మ్యాచ్‌లు ఆడగా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు 95.78 స్ట్రైక్‌ రేట్‌తో 6939 పరుగులు చేశారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లాండ్‌(5373), మూడో స్థానంలో దక్షిణాఫ్రికా(4041), నాలుగో స్థానంలో పాక్‌(4003), ఐదో స్థానంలో శ్రీలంక(3668) ఉన్నాయి. స్ట్రైక్‌ రేట్‌ విషయంలో మాత్రం భారత్..‌ ఇంగ్లాండ్‌ తర్వాత రెండోస్థానంలో ఉంది. ఇక భారత టాప్‌ ఆర్డర్‌ సరాసరి 62.51. ఇది ఇతర జట్ల కంటే అధికం.

2017 నుంచి కోహ్లీ సేననే ముందుంది

2017 నుంచి కోహ్లీ సేననే ముందుంది

ఇక 2017 నుంచి టాప్‌ ఆర్డర్‌లో సెంచరీలు, హాఫ్ సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ల వివరాలు చూసినా కోహ్లీ సేననే ముందుంది. గత 44 మ్యాచ్‌ల్లో భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు 25 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. ఇంగ్లండ్‌ 41 మ్యాచ్‌ల్లో 16 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు చేసి రెండో స్థానంలో.. 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో పాక్‌(33 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉంది. ఈ గణాంకాలు వన్డేల్లో టీమిండియా ఎంత బలంగా ఉందో చెబుతున్నాయి.

వన్డే సిరీస్‌లో భారత్‌కు కఠిన సవాల్

వన్డే సిరీస్‌లో భారత్‌కు కఠిన సవాల్

టెస్టు సిరీస్ ఏకపక్షంగా సాగినప్పటికీ.. వన్డే సిరీస్‌లో భారత్‌కు కఠిన సవాల్ ఎదురుకానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో విండీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడతారు. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఆదివారం నుంచే ఆ జట్టుతో ఐదు వన్డేల సిరీస్ ఆరంభంకాబోతోంది. గువాహటిలో తొలి వన్డే జరగనుంది. శుక్రవారమే టీమ్‌ఇండియా ఆటగాళ్లు స్టేడియంలో ట్రైనింగ్ సెషన్‌కు హాజరయ్యారు.

Story first published: Saturday, October 20, 2018, 11:04 [IST]
Other articles published on Oct 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+