జ్యూస్‌తో రవిశాస్త్రి ఫోటో.. మద్యం బాటిల్స్‌తో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!!

ఆంటిగ్వా: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ తొలి పోరులో టీమిండియా బోణీ కొట్టింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని టీమిండియా వేడుక చేసుకుంటోంది. రెండో టెస్టుకు కాస్త విరామం లభించడంతో ఆటగాళ్లు అందరూ కరీబియన్ దీవుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు.
ఇది జ్యూస్ సమయం:
విరామ సమయంను ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా కొకొబే బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ రవిశాస్త్రి కరేబియన్ అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. 'హాట్ హాట్ హాట్. ఇది జ్యూస్ సమయం. కోకోబేలోని షీర్ రాక్ చాలా అందంగా ఉంది' అని క్యాప్షన్ రాసుకోచ్చాడు. ఆ ఫొటోలో రవిశాస్త్రి బీచ్ ఒడ్డున నిలబడి టైటానిక్ పోజ్ ఇచ్చాడు.

చేతుల్లో మద్యం బాటిల్స్ పెట్టి:
అయితే ఈ ఫోటోపై కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రవిశాస్త్రి చేతులు చాచి ఫోటోకు ఫోజులివ్వగా.. నెటిజన్స్ మాత్రం ఆయన చేతుల్లో మద్యం బాటిల్స్ పెట్టి ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా పెద్ద గ్లాసును పెట్టి మార్ఫింగ్ చేసాడు. రవిశాస్త్రి మద్యంతో ఎంజాయ్ చేస్తున్నాడని కొందరు ట్రోల్ చేయగా.. హాయిగా ఉన్నట్టుందని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా రవిశాస్త్రి 2021 టీ20 ప్రపంచకప్ వరకు హెడ్ కోచ్‌గా నియమితులయిన విషయం తెలిసిందే.

యాచ్‌పై విరుష్క సందడి:
మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ యాచ్‌పై సముద్ర తీరంలోని అలలపై ఎంజాయ్ చేశారు. వారితో పాటు కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్ కూడా సరదా సమయం గడిపారు. అందరూ 'విజయం' చిహ్నాలు చూపించారు. ఇందుకు సంబంధించిన పోటోలను రాహుల్, అశ్విన్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. రాహుల్ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. 'ఎండ్‌లెస్ బ్లూస్' అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications