Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టీ20లో శాంసన్‌కు దక్కని చోటు.. మండిపడుతున్న ఎంపీ శశిథరూర్‌!!

India vs West Indies: MP Shashi Tharoor is unhappy with Sanju Samson’s absence from second T20I

ఢిల్లీ: కేరళ యువ వికెట్‌కీపర్‌ సంజూ శాంసన్‌ అందరికి సుపరిచితమే. ఐపీఎల్, దేశవాళీ టోర్నీలలో మెరుపులు మరిపించాడు. అద్భుత బ్యాటింగ్‌తో మాజీల మన్నలు కూడా అందుకున్నాడు. అయినా టీమిండియా తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ముస్తాక్‌ అలీ టోర్నీలో రెగ్యులర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌కు మోకాలి గాయం కారణంగా శాంసన్‌ ఎట్టకేలకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఒక్క ఛాన్స్:

ఒక్క ఛాన్స్:

శాంసన్‌ టీమిండియాతో ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వరుసగా విఫలమవుతున్నప్పటికీ.. టీమ్‌మేనేజ్‌మెంట్‌, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరలా అతడికే అవకాశాలు ఇస్తున్నారు. దీంతో శాంసన్‌తో పాటు కేరళ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇస్తే అతడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది కదా అని మండిపడుతున్నారు.

నిరాశలో అభిమానులు:

నిరాశలో అభిమానులు:

ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20లో పంత్‌ విఫలమవ్వడంతో.. తిరువనంతపురం వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో స్థానిక ఆటగాడు అయిన శాంసన్‌కు అవకాశం ఇస్తారని అందరూ భావించారు. అయితే కెప్టెన్ మాత్రం పంత్‌కే ఓటేశాడు. దీంతో కేరళ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అవకాశం ఇస్తారనుకున్నాం:

అవకాశం ఇస్తారనుకున్నాం:

'శాంసన్‌ను సొంత మైదానం (తిరువనంతపురం)లో ఆడించే అవకాశం ఇస్తారని అనుకున్నాం. శాంసన్‌ ఆడేందుకు టీమిండియా ఒక ఆటగాడికి విశ్రాంతి ఇస్తుందని ఆశించాం. తిరువనంతపురంలో అద్భుతాలు చేయాలని కోరుకున్నాం. కానీ.. నిరాశే ఎదురైంది. శాంసన్‌కు ఉన్న అత్యంత ధైర్య సాహసాలు, ఓపికకు మేమందరం ఏంతో ప్రేరణ పొందుతున్నాం' అంటూ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు.

అతని హృదయాన్ని పరీక్షించాలనుకుంటున్నారా?

అతని హృదయాన్ని పరీక్షించాలనుకుంటున్నారా?

బంగ్లాదేశ్‌ సిరీస్‌లో సంజుకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు కూడా శశిథరూర్‌ స్పందించాడు. 'అవకాశం ఇవ్వకుండా శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. అతనికి కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఆటగాళ్లకు డ్రింక్స్‌ ఇవ్వదానికే పరిమితం చేశారు. సంజు బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా లేక అతని హృదయాన్నా?' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. చాలా సందర్భాల్లోనే శాంసన్‌కు శశిథరూర్‌ మద్దతుగా నిలిచారు.

Story first published: Wednesday, December 11, 2019, 11:15 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+