India vs West Indies: ధావన్, కుల్దీప్ ఇన్.. ఆ ఇద్దరు అరంగేంట్రం! చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేలను గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా జోరు మీదుంది. ఇదే ఊపులో శుక్రవారం జరగనున్న చివరి వన్డే మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో చివరిదైన మూడో వన్డేలో సీనియర్లకు విశ్రాంతినిచ్చి పలు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని టీమ్ మెనేజ్‌మెంట్ భావిస్తుందని సమాచారం.

జట్టులోకి ధావన్, కుల్దీప్
వన్డే సిరీస్‌కు ముందు కరోనా బారిన పడిన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిగా కోలుకున్నాడు. దీంతో శుక్రవారం నాటి మూడో వన్డేలో ధావన్ బరిలోకి దిగడం ఖాయమైపోయింది. కనుక రెండో వన్డేలో ఆడిన దీపక్ హుడాకు మూడో మ్యాచ్‌లో చోటు దక్కడం కష్టమే అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అలాగే సిరీస్‌లో అదరగొడుతున్న యజుర్వేంద్ర చాహల్‌కు మూడో వన్డే మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వనున్నారని సమాచారం. చాహల్‌కు విశ్రాంతినిచ్చి మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించనున్నారట.

సిరాజ్, ఠాకూర్ ఔట్
టీమిండియాలో నిలకడగా రాణిస్తూ మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. అయితే తాజా వన్డే సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా సిరీస్ గెలవడంతో వీరిద్దరికి చివరి మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించాలని టీమ్ మెనేజ్‌మెంట్ నిర్ణయించిందని సమాచారం. అందుకే శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్‌కు మూడో వన్డేలో అవకావం కల్పించనున్నారని సమాచారం.

అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ అరంగేంట్రం
ఇక మహ్మద్ సిరాజ్ ప్లేసులో యువ పేసర్ అవేష్ ఖాన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేయించాలని టీమిండియా మేనేజ్‌ముంట్ భావిస్తోందట. అలాగే తొలి వన్డేలో అరంగేంట్రం చేసిన దీపక్ హుడా ప్లేసులో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను సైతం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయించాలని నిర్ణయించిందట.

క్లీన్‌స్వీపే లక్ష్యంగా
ఇప్పటికే వన్డే సిరీస్‌ను గెలిచిన టీమిండియా నామమాత్రమైన చివరి మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలను సైతం సిద్ధం చేసింది. అయితే చాలా కాలంగా సరైన ఫాంలో లేని కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి వన్డేలోనైనా రాణించాలని టీమిండియా భావిస్తోంది. ఇక వెస్టిండీస్ మాత్రం పరువు కోసం ఆరాటపడుతోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోవడంతో చివరి మ్యాచ్‌నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. గాయంతో రెండో వన్డేకు దూరమైన ఆ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డు మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ,
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications