Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే సిరీస్‌: ధావన్‌ స్థానంలో మయాంక్‌.. శాంసన్‌కు నిరాశ!!

India vs West Indies: Mayank Agarwal replacement for injured Shikhar Dhawan in ODIs

ముంబై: గాయపడిన రెగ్యులర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ స్థానంలో టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బుధవారం సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. మయాంక్‌ చోటు దక్కించుకోవడంతో సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది.

శాంసన్‌కు నిరాశ:

శాంసన్‌కు నిరాశ:

మోకాలి గాయం కారణంగా శిఖర్‌ ధావన్‌ మొదటగా టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ధావన్‌కు గాయం నయమయినప్పటికీ.. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందటానికి కొంత సమయం పడుతుందని బీసీసీఐ వైద్య బృందం తెలిపింది. దీంతో వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌కు ధావన్‌ స్థానంలో శాంసన్‌ను ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌కు కూడా శాంసన్‌నే ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

ప్రత్యామ్నాయ ఓపెనర్‌కు ఓటు:

ప్రత్యామ్నాయ ఓపెనర్‌కు ఓటు:

రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా జట్టులో కేఎల్‌ రాహుల్‌ ఉండటంతో.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌ వైపు బీసీసీఐ సెలక్టర్లు మొగ్గు చూపారు. దీంతో కర్ణాటక ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం దక్కింది. ఈ ఒక్క మార్పు మినహా టీమిండియా వన్డే జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పేలవ ఫామ్ కొనసాగిస్తున్న కేదార్‌ జాదవ్‌ కూడా చోటు నిలుపుకున్నాడు. హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న విషయం తెలిసిందే.

అప్పుడు.. ఇపుడు గాయాల కారణంగానే చోటు:

అప్పుడు.. ఇపుడు గాయాల కారణంగానే చోటు:

టెస్టుల్లో మయాంక్‌ అగర్వాల్‌ అదరగొడుతున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇక ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌లోనూ డబుల్ సెంచరీ చేసి హీరో అయ్యాడు. వేగంగా ఆడడం కూడా మయాంక్‌కు కలిసొచ్చింది. ప్రపంచకప్‌లో విజయ్‌ శంకర్‌ స్థానంలో టీమిండియాలో చోటు దక్కించుకున్న మయాంక్‌.. మరోసారి గాయం కారణంగానే వన్డే జట్టులోకి రావడం విశేషం.

వన్డే జట్టు:

వన్డే జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌.

Story first published: Wednesday, December 11, 2019, 17:15 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+