వెస్టిండీస్‌తో వన్డే సిరీస్: ధావన్ స్థానంలో మయాంక్.. జట్టు ఇదే?!!

ముంబై: టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలి గాయం కారణంగా ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్ అనంతరం జరిగే వన్డే సిరీస్ నుంచి కూడా ధావన్ తప్పుకొన్నాడు.ధావన్ స్థానంలో టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చే అవకాశముంది.

మోకాలికి గాయం:
శిఖర్ ధావన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతుండగానే వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ మోకాలికి గాయం అయింది. దీంతో విండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ధావన్ స్థానంలో కేరళ వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు.

ధావన్ స్థానంలో మయాంక్:
గాయపడిన శిఖర్ ధావన్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ముందు చిన్న గాయమే అనుకున్నా.. దాని తీవ్రత అధికంగా ఉండటంతో అతడి స్థానంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. టీం మేనేజ్‌మెంట్‌తో చర్చించాక వన్డే సిరీస్‌కు ధావన్ స్థానంలో మయాంక్ పేరును సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించినట్టు ఆ అధికారి పేర్కొన్నారు.

చెన్నైలో తొలి వన్డే:
భారత్ తరపున మయాంక్ 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఇప్పటివరకు ఒక్క వన్డే, టీ20 ఆడలేదు. టెస్టుల్లో మయాంక్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్ అనంతరం ఈనెల 15 నుంచి భారత్, వెస్టిండీస్ జట్లు మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. తొలి వన్డే ఈనెల 15న చెన్నైలో.. రెండో వన్డే 18న విశాఖపట్నంలో.. మూడో వన్డే 22న కటక్‌లో జరుగుతాయి.

వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు (అంచనా):
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్, శివమ్ దూబె, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications