విండిస్ 311 ఆలౌట్: షా హాఫ్ సెంచరీ, లంచ్ విరామానికి భారత్ 80/1

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు లంచ్ విరామానికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(52), పుజారా(9) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 101.4 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా 61 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. వెస్టిండిస్‌తో రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగిన రాహుల్.. రెండో టెస్టులో నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు.

కేఎల్ రాహుల్ వరుసగా వైఫల్యం
కేఎల్ రాహుల్ బౌల్డ్ లేదా ఎల్బీగా పెవిలియన్‌కు చేరడం తొమ్మిదోసారి. ఇలా, కేఎల్ రాహుల్ వరుసగా వైఫల్యం కావడంతో అతని కెరీర్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఫుట్‌వర్క్ సమస్యతో బాధపడుతున్న రాహుల్ చెత్త బంతులకు సైతం నిష్క్రమిస్తూ ఉండటం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
రెండో టెస్టులో పృథ్వీ షా హాఫ్ సెంచరీ
మరోవైపు తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న మరో ఓపెనర్ పృథ్వీ షా రెండో టెస్టులో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకే వెస్టిండిస్ ఆలౌట్
అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ 311 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 295/7తో శనివారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండిస్ జట్టు ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 16 పరుగులను మాత్రమే జోడించి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది.

సెంచరీతో ఆకట్టుకున్న రోస్టన్ ఛేజ్
తొలిరోజు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విండీస్ ఓవర్‌నైట్ ఆటగాడు రోస్టన్ ఛేజ్(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రోస్టన్ చేజ్ (106) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిషూ(2), గాబ్రియెల్‌లు వెనువెంటనే పెవిలియన్ బాటపట్టారు.
టెస్టుల్లో రెండోసారి ఐదు వికెట్లను తీసుకున్న ఉమేశ్ యాదవ్
ఈ టెస్టులో రోస్టన్ ఛేజ్ వికెట్ తీయడం ద్వారా ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో రెండోసారి ఐదు వికెట్లను తీసుకున్నాడు. చివరి మూడు వికెట్లు ఉమేశ్ యాదవ్ సాధించడం మరో విశేషం. దీంతో రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వెస్టిండిస్ జట్టు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ మూడు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications