Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టీ20 విజయంతో.. మూడో ఫార్మాట్‌నూ గెలిచేసిన భారత్‌

West Indies captain Carlos Brathwaite won

హైదరాబాద్: రోహిత్ సేన దంచేసింది. 182పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించి.. మూడో టీ20ని గెలిచేసింది. నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఏ మాత్రం దయచూపలేదు. విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ అదే దూకుడుతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.చెపాక్‌లో జరుగుతున్న చివరి టీ20లో వెస్టిండీస్‌ అదరగొట్టింది. ఆరు వికెట్ల తేడాతో భారత్ మరోసారి వెస్టిండీస్‌కు పరాజయం పాలైయ్యారు.

భారత్‌కు మంచి లక్ష్యమే నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్‌ రాణించారు. గత మ్యాచ్‌లకు భిన్నంగా షై హోప్‌ (24), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (26) ఓపెనర్లుగా దిగారు. హెట్‌మైయిర్‌, షై హోప్‌ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఈ క్రమంలో పది పరుగుల వ్యవధిలో వీరిని యజువేంద్ర చాహల్‌ పెవిలియన్‌కు పంపించాడు. దినేశ్‌ రామ్‌దిన్‌ (15)ఎప్పటిలాగే తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో డారెన్‌ బ్రావో (43), నికోలస్‌‌ పూరన్‌ (53) అజేయంగా నిలిచారు. చక్కని షాట్లు ఆడారు. 43 బంతుల్లో 87 పరుగుల కీలకమైన భాగస్వామ్యం అందించారు. ఖలీల్‌ వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సాధించారు. భారత్‌ ముందు 182 పరుగుల లక్ష్యం ఉంచారు.

టాస్ రిపోర్ట్:

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0 తేడాతో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోగా, ఆఖరిదైన ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ ఆలోచిస్తుండగా, మరోవైపు విండీస్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

ఇక చివరి టీ20 మ్యాచ్‌కు భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బుమ్రా, కుల్‌దీప్‌లకు విశ్రాంతినివ్వడంతో వారి స్థానంలోకి చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు జట్టులోకి వచ్చి చేరారు. ఇక విండీస్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లతోనే బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, లోకేష్ రాహుల్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, చాహల్.
వెస్టిండీస్: షై హోప్, షిమ్రాన్ హెట్‌మైర్, డారెన్ బ్రేవో, దినేష్ రామ్‌దిన్ (వికెట్ కీపర్), నికోలాస్ పూరన్, కిరన్ పొలార్డ్, కార్లొస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, కీమో పాల్, ఖేరీ పియెరె, ఒషానె థామస్.

Story first published: Sunday, November 11, 2018, 22:51 [IST]
Other articles published on Nov 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+