
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ జట్టుకు సరైన శుభారంభం లభించలేదు. తొలి పరుగు వద్ద కీరన్ పావెల్ (0)ను భువనేశ్వర్ పెవిలియన్‌కు చేర్చగా, రెండో పరుగు వద్ద షైహోప్ (0)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శామ్యూల్స్ (24), రోమన్ పావెల్ (16) స్కోరు బోర్డుని నడిపించారు.

36 పరుగుల వద్ద శామ్యూల్స్ ఔట్
జట్టు స్కోరు 36 పరుగుల వద్ద శామ్యూల్స్‌ను జడేజా పెవిలియన్‌కు చేర్చగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఖలీల్ బౌలింగ్‌లో రోమన్ ఔటయ్యాడు. ఈ సిరిస్‌లో తొలి నాలుగు వన్డేల్లో రాణించిన హిట్‌మెయిర్ (9) పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ (25) కాసేపు క్రీజులో నిలిచాడు.
ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు
ఆ తర్వాత యువ పేసర్ ఖలీల్ అతడిని కూడా పెవిలియన్‌కు చేర్చాడు. వెస్టిండిస్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... కెప్టెన్ జాసన్ హోల్డర్ 25 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైపోయారు. దీంతో చివరికి ఆ జట్టు 31.5 ఓవర్లకు 104 పరుగులకు ఆలౌటైంది.

నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్‌కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు. తాజా విజయంతో రికార్డు స్థాయిలో విండీస్ జట్టుపై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్ విజయాన్ని, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్‌ను కోహ్లీసేన నెగ్గడం విశేషం.


Click it and Unblock the Notifications













