
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డే ప్రారంభమైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.
కుల్దీప్ యాదవ్ స్థానంలో చైనామన్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు విండీస్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. షెల్డన్ కొట్రెల్ స్థానంలో కీమో పాల్, ఓషెన్ థామస్ స్థానంలో ఫాబైన్ అలెన్ జట్టులోకి వచ్చారు.
ఇదిలా ఉంటే, ఈ సిరిస్‌లో గుయానా వేదికగా జరగ్సాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఇదే వేదికలో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌లో 1-0తో టీమిండియా ఆదిక్యంలో ఉంది. దీంతో ఇప్పుడు ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.
మూడు టీ20ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆతిథ్య వెస్టిండీస్ భావిస్తోంది.
జట్ల వివరాలు:
భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషభ్‌పంత్, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, మహ్మద్ షమి, యుజువేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్
వెస్టిండిస్: క్రిస్‌గేల్, ఎవిన్ లూయిస్, షై హోప్, హెట్‌మైయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్(కెప్టెన్), కార్లోస్ బ్రాత్‌వైట్, ఫాబియన్ అలెన్, కీమర్ రోచ్, కీమో పాల్