హైదరాబాద్ టెస్ట్: పంత్ మళ్లీ సెంచరీ మిస్, ద్రవిడ్ రికార్డు సమం

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ యువ సంచలనం రిషబ్ పంత్ మరోసారి సెంచరీని చేజార్చుకున్నాడు. గత రాజ్‌కోట్ టెస్ట్‌లో సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లోను దురదృష్టం వెంటాడింది. సెంచరీకి చేరువైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాబ్రియేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తొలి టెస్టులో 92 పరుగులు చేసి ఔటయిన పంత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన పంత్.. అనవసర షాట్‌కు ప్రయత్నించి మిడ్‌ఆఫ్‌లో ఉన్న హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో వరుస ఇన్నింగ్స్‌ల్లో 90పైచిలుకు పరుగుల వద్ద ఔటైన రెండో భారత ఆటగాడిగా పంత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ రికార్డు మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట
అంతకుముందు ఈ రికార్డు మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. 1997 శ్రీలంకపై రెండు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ద్రవిడ్ వరుసగా 92, 93 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇప్పుడు పంత్ కూడా రాజ్ కోట్, హైదరాబాద్ రెండు వేదికల్లోను పంత్ 92 పరుగుల వద్దే వెనుదిరగడం గమనార్హం.

రాజ్‌కోట్ టెస్టులో తృటిలో సెంచరీని మిస్సైన పంత్
రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పృథ్వీ షా, కోహ్లి, రవీంద్ర జడేజా శతకాలు సాధించగా.. పంత్ తృటిలో కోల్పోయాడు. తొలి నుంచి దూకుడుగా ఆడిన పంత్.. వన్డే తరహాలో 84 బంతులు మాత్రమే ఆడి 92 పరుగులు సాధించి కీమోపాల్‌కు బౌలింగ్ లో పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు రెండో టెస్టులో సైతం జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

92 పరుగుల వద్ద గాబ్రియేల్ బౌలింగ్‌లో
ఆటలో భాగంగా మూడోరోజు 92 పరుగుల వద్ద గాబ్రియేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంటున్న రిషబ్ పంత్ సెంచరీకి చేరువకు వచ్చి ఔట్ కావడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. రిషబ్ పంత్ సెంచరీని చేజార్చుకోవడం సచిన్ టెండూల్కర్ 90ల ఫోబియాను గుర్తుచేస్తోంది.

14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయిన భారత్
ఓవర్ నైట్ స్కోరు 308/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తొలుత రహానే (80) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. గత టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జడేజా ఈ మ్యాచ్‌లోపూర్తిగా నిరాశపరిచాడు. ప్రస్తుతం టీమిండియా 100 ఓవర్లకు గాను తొమ్మిది వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications