హైదరాబాద్ టెస్ట్: పంత్ సెంచరీ మిస్, భారత్ 367 ఆలౌట్, ఆధిక్యం 56

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 367 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 308/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 59 పరుగులు మాత్రమే జోడించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్‌పై టీమిండియా 56 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
మూడోరోజైన ఆదివారం ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్ నైట్ ఆటగాడు రహానే(80) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు.

తృటిలో సెంచరీని మిస్ చేసుకున్న రిషబ్ పంత్
ఇక, రెండో రోజు ఆటలో అద్భుత ఆటతీరు కనబరిచిన రిషబ్ పంత్ తృటిలో మూడో రోజు తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన పంత్.. అనవసర షాట్‌కు ప్రయత్నించి మిడ్‌ఆఫ్‌లో ఉన్న హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో వరుస ఇన్నింగ్స్‌ల్లో 90పైచిలుకు పరుగుల వద్ద ఔటైన రెండో భారత ఆటగాడిగా పంత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

రాహుల్ ద్రవిడ్ రికార్డుని సమం చేసిన పంత్
అంతకుముందు ఈ రికార్డు మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. 1997 శ్రీలంకపై రెండు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ద్రవిడ్ వరుసగా 92, 93 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇప్పుడు పంత్ కూడా రాజ్ కోట్, హైదరాబాద్ రెండు వేదికల్లోను పంత్ 92 పరుగుల వద్దే వెనుదిరగడం గమనార్హం. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పృథ్వీ షా, కోహ్లి, రవీంద్ర జడేజా శతకాలు సాధించగా.. పంత్ తృటిలో కోల్పోయాడు.

92 పరుగుల వద్ద గాబ్రియేల్ బౌలింగ్‌లో ఔట్
తొలి నుంచి దూకుడుగా ఆడిన పంత్.. వన్డే తరహాలో 84 బంతులు మాత్రమే ఆడి 92 పరుగులు సాధించి కీమోపాల్‌కు బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు రెండో టెస్టులో సైతం జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆటలో భాగంగా మూడోరోజు 92 పరుగుల వద్ద గాబ్రియేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 367 పరుగుల వద్ద ఆలౌట్
చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంటున్న రిషబ్ పంత్ సెంచరీకి చేరువకు వచ్చి ఔట్ కావడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కుల్దీప్(6), ఉమేశ్‌లు(2) కూడా వెంట వెంటనే ఔటయ్యారు. అయితే రవిచంద్రన్ అశ్విన్(35) స్కోర్ పెంచేందుకు ప్రయత్నించగా.. గాబ్రియేల్ బౌలింగ్‌లో పదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 367 పరుగుల దగ్గర టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. వెస్టిండీస్ బౌలర్లలో ఆ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ ఐదు వికెట్లు తీయగా.. గాబ్రియేల్ మూడు వికెట్లు తీసుకోగా, వారికమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications