
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో రెండో రోజు టీ విరామానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానె (19 బ్యాటింగ్), రిషబ్ పంత్ (9 బ్యాటింగ్) ఉండగా, ఇంకా 138 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది.
అంతకముందు యువ ఓపెనర్ పృథ్వీ షా (70) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి సెషన్‌ని 80/1తో ముగించింది. ఆ తర్వాత రెండో సెషన్‌లో దూకుడుగా ఆడుతున్న పృథ్వీ షా(70) పరుగుల వద్ద విండిస్ బౌలర్ వారికన్ వేసిన బంతిని పృథ్వీ షా... హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత 19.6 ఓవర్‌లో గాబ్రియల్ వేసిన బంతిని పుజారా(10; 50 బంతుల్లో, 2 ఫోర్లు) హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (45: 78 బంతుల్లో 5 ఫోర్లు) వికెట్లను భారత్ చేజార్చుకుంది. తొలి సెషన్‌లో పృథ్వీ షా ధాటికి తేలిపోయిన విండిస్ బౌలర్లు రెండో సెషన్‌లో ఫర్వాలేదనిపించారు.
జట్టు స్కోరు 98 పరుగుల వద్ద పృథ్వీ షాని ఔట్ చేసిన కరేబియన్ బౌలర్లు.. ఆ తర్వాత 102 వద్ద పుజారాని పెవిలియన్‌కు చేర్చారు. ఈ దశలో రహానేతో కలిసి విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్ నడిపించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీని జట్టు స్కోరు 162 వద్ద హోల్డర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతకముందు విండిస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసి ఆలౌటైంది.