హైదరాబాద్ టెస్ట్: భారత బౌలర్ల జోరు, టీ విరామానికి వెస్టిండిస్ 197/6

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక వెస్టిండిస్ జట్టు తడబడుతోంది. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో తొలిరోజు టీ విరామ సమయానికి వెస్టిండిస్ జట్టు 6 వికెట్లకు 197 పరుగులు చేసింది.
పది ఓవర్ల పాటు నిలకడగా ఆడిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ని భారత బౌలర్లు చెదరగొట్టారు. విండిస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చేజ్ (50 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఒకానొక దశలో 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్ జట్టుని ఆ తర్వాత డౌరిచ్ (30)తో కలిసి ఆరో వికెట్‌కు చేజ్ 69 పరుగులు జోడించడం విశేషం.
ఇన్నింగ్స్ 59.3ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి డోరిచ్(30; 63 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో వెస్టిండిస్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, ఉమేష్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
కాగా, హైదరాబాద్ టెస్ట్‌తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన శార్ధూల్ ఠాకూర్ కేవలం పది బంతులు వేసి గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ కోహ్లీ, ఫిజియో సూచన మేరకు మైదానాన్ని వీడాడు. అయితే, శార్ధూల్ ఠాకూర్ తొలి రోజు మొత్తం మైదానంలోకి దిగడని టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
వెస్టిండిస్ జట్టు వికెట్ల పతనం సాగిందిలా:

ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్
హైదరాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ వికెట్ల పతనం కొనసాగుతోంది. ఐదో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్38.5 ఓవర్లో కుల్దీప్ వేసిన బంతిని సునిల్ ఆంబ్రిస్(18) రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.

నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్
హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ నాలుగో వికెట్ చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 34.1 ఓవర్లలో కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి హెట్‌మెయిర్(12) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన విండీస్
హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ వేసిన బంతికి ఓపెనర్ బ్రాత్‌వైట్(14) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన విండీస్
హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కైరన్ పోవెల్(22) అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications