లక్నోలో రెండో టీ20: టీమిండియా బ్యాటింగ్, జట్టులోకి భువనేశ్వర్

హైదరాబాద్: లక్నో వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇరు జట్ల ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టులో ఉమేష్ యాదవ్‌కు బదులుగా భువనేశ్వర్ ఆడుతుండగా, విండిస్ జట్టులో నికోలాస్ పూరాన్ చేరాడు.
కొత్తగా నిర్మించిన లక్నో స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. 50వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలోని టిక్కెట్లన్నీ మ్యాచ్‌కు వారం రోజుల ముందే హాట్ కేకుళ్లా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు మ్యాచ్‌కు ముందు రోజైన సోమవారం ఈ స్టేడియం పేరును మార్చేశారు.
లక‍్నోలో కొత్తగా నిర్మించిన ఈ స్టేడియం పేరును దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుమీదుగా 'భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం'గా మార్చేశారు.
బ్రాత్‌వైట్ మాట్లాడుతూ
టాస్ అనంతరం విండిస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ మాట్లాడుతూ "గత మ్యాచ్‌లో బౌలింగ్ బాగా చేశాం. కొత్త స్టేడియం కావడం, మంచు కురిసే అవకాశం ఉండటంతో తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. నికోలస్ పూరన్ స్థానంలో రోవ్‌మన్ పోవెల్‌కు తుది జట్టులోకి వచ్చాడు" అని చెప్పాడు.

టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్‌నే ఎంచుకునేవాళ్లం
అనంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ "టాస్ గెలిచినట్లైతే మేం కూడా బౌలింగ్‌నే ఎంచుకునేవాళ్లం. పచ్చిక ఉన్నది కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఉమేశ్ స్థానంలో జట్టులోకి భువీ వచ్చాడు" అని తెలిపాడు.
1-0 ఆధిక్యంలో టీమిండియా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు పర్యాటక వెస్టిండిస్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలనుకుంటోంది.
జట్ల వివరాలు:
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, రిషబ్ పంత్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
వెస్టిండీస్: షై హోప్, దినేష రామ్‌దిన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, కిరన్ పొల్లార్డ్, డారెన్ బ్రావో, నికోలాస్ పూరాన్, కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, కీమో పౌల్, ఖేరీ పియరె, ఓషానె థామస్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications