
హైదరాబాద్: ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు టీమిండియా సిద్ధమైంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియంలో వెస్టిండిస్‌తో తొలి టెస్టులో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఈ సందర్భంగా జాసన్ హోల్డ్ మాట్లాడుతూ ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. గాల్లో తేమ ఉండటంతో దానిని నుంచి ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నామని తెలిపాడు. టెస్టు సిరిస్‌ను ఘనంగా ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపాడు. ఈ సిరిస్‌లో మా వంతు కృషి చేయాలి... మా జట్టు తరుపున షమర్ బ్రూక్స్ టెస్టు అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు.
అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "మేము కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలని అనుకున్నాం. సాధ్యమైనన్ని పరుగులు చేసి ఆ తర్వాత బంతితో దాడి చేయాలని భావించాం. మిడిల్‌లో ఏమి చేయాలో మాకు తెలుసు. మంచి క్రికెట్ ఆడటం అవసరం. ఈ సిరీస్‌లో మయాంక్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. ఈరోజు సాహా, రోహిత్, అశ్విన్, కుల్దీప్, ఉమేష్ ఆడటం లేదు" అని అన్నాడు.
అంతకముందు స్టేడియం పరిసరాల్లో వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా తన సిరిస్‌ను విండిస్ పర్యటనతో ప్రారంభిస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్‌పై కన్నేసింది.
సొంతగడ్డపై వన్డే, టీ20 సిరీస్‌ని చేజార్చుకున్నా వెస్టిండిస్ కనీసం టెస్టు సిరీస్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే, తొలి టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు ఆల్ రౌండర్ కీమో పాల్ దూరమయ్యాడు.
జట్ల వివరాలు:
ఇండియా:
మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజ్యింకె రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
వెస్టిండిస్:
క్రైగ్ బ్రాత్‌వైట్, జాన్ కాంప్‌బెల్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), షమర్ బ్రూక్స్, డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్మియర్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్ (కెప్టెన్), మిగ్యుల్ కమ్మిన్స్, షానన్ గాబ్రియేల్, కేమర్ రోచ్