న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvWI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన, వెస్టిండీస్ కెప్టెన్ మార్పు

India vs West Indies 2018 : Virat Kohli Elects To Bat Vs Windies
 India vs West Indies Live Score, 1st Test Day 1: Virat Kohli Elects To Bat vs Windies, Prithvi Shaw Makes India Debut

న్యూ ఢిల్లీ: భారీ అంచనాల మధ్య రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్-భారత్‌ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంటో టీమిండియా ట్యాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తొలి టెస్టుకు దూరం కాగా.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

షెర్‌మన్ లూయిస్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అడుగుపెడుతున్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో భంగపడ్డ భారత్‌.. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో మళ్లీ గెలుపుబాట పట్టాలనుకుంటోంది.

1
44264

స్వదేశంలో ఎదురులేని టీమిండియా.. గురువారం మొదలయ్యే తొలిటెస్టులో విండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఎవరనేదానిపై విస్తృతంగా జరుగుతున్న చర్చకు తెరదించారు. టీనేజ్‌ సంచలనం పృథ్వీ షా ఓపెనర్‌గా టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. 2012 తర్వాత ఓపెనింగ్‌లో మరో జోడీ శకం ఆరంభమవనుంది. గతంలో టాస్‌ వరకు తుదిజట్టు టీమిండియా వివరాలు బయటకు వెల్లడించలేదు.

ఈసారి ఒకరోజు ముందుగానే ఫైనల్‌ 12మందిని ప్రకటించి సరికొత్త సంప్రదాయానికి తెరదీసింది. గడచిన తొమ్మిది నెలల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీ్‌సలు ఓడినా.. టెస్టుల్లో అగ్రస్థానం మాత్రం భారత్‌ చేజారలేదు. కోచ్‌ స్టువ ర్ట్‌ లా హయాంలో విండీస్‌ ప్రదర్శన మెరుగుపడింది. గతేడాది లీడ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. షై హోప్‌ రెండు ఇన్నింగ్స్‌లో శతకాలతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు.

బంగ్లాను 2-0తో ఓడించిన కరీబియన్లు.. తాజాగా శ్రీలంకతో సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించారు. త్వరలో కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్న స్టువర్ట్‌.. ప్రస్తుత జట్టుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. వడోదరాలో రెండు రోజుల వామప్‌ మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లో విండీస్‌ టీమ్‌ ప్రాక్టీస్‌ చేసింది. భారత టూర్‌ క్లిష్టమే అయినా.. గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్టువర్ట్‌ చెప్పాడు. జట్టు ప్రతిభపై ఎంతో నమ్మకం ఉందన్నాడు.

భారత్ జట్టు:

Lokesh Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravichandran Ashwin, Ravindra Jadeja, Umesh Yadav, Mohammed Shami, Kuldeep Yadav

వెస్టిండీస్ జట్టు:

Kraigg Brathwaite (c), Kieran Powell, Shimron Hetmyer, Shai Hope, Roston Chase, Sunil Ambris, Shane Dowrich (wk), Keemo Paul, Devendra Bishoo, Sherman Lewis, Shannon Gabriel

Story first published: Thursday, October 4, 2018, 11:45 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X