Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3rd T20I: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

India vs West Indies, LIVE Cricket Score, 3rd T20I at Guyana: Virat Kohli aims to experiment as windies fight for pride

హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆఖరి టీ20కి సర్వం సిద్ధమైంది. గుయానా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. కనీసం చివరి టీ20లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్‌ ఆశిస్తోంది.

మూడు టీ20ల సిరిస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ కొనసాగిస్తుంటే.. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం ఇప్పటి వరకు సరైన ప్రదర్శన చేయలేదు. ధావన్‌ తిరిగి ఫామ్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు.

జట్ల వివరాలు:

భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్‌, పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, సుందర్, దీపక్ చాహర్.

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), క్యాంప్‌బెల్, నరైన్, పూరన్, హెట్‌మైర్, పొలార్డ్, రావ్‌మన్‌ పావెల్, కీమో పాల్, ఖారీ పైర్, కాట్రెల్, థామస్‌.

Story first published: Tuesday, August 6, 2019, 21:41 [IST]
Other articles published on Aug 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+