దెబ్బకు దిగొచ్చిన సెలక్టర్లు: విండిస్‌తో చివరి రెండు వన్డేలకు జాదవ్‌కు చోటు

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా విండిస్‌తో చివరి మూడు వన్డేల కోసం తనని భారత జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై కేదార్ జాదవ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ సూచించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. జాదవ్‌ను 4, 5 వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో తాజాగా చోటు కల్పించారు.
ఈ మేరకు చిన్న సవరణ అంటూ కేదార్ జాదవ్‌కు చివరి రెండు వన్డేల్లో అవకాశం ఇస్తున్నట్లు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

పూర్తి ఫిట్‌నెస్ సాధించినా
ఇప్పటికే వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని సెలక్టర్లు గురువారం సాయంత్రమే ప్రకటించారు. అయితే ఈ జట్టులో సెలక్టర్లు కేదార్ జాదవ్‌కు చోటు కల్పించారు. దీంతో పూర్తి ఫిట్‌నెస్ సాధించినా సెలక్టర్లు ఎందుకు జట్టులోకి ఎంపిక చేయలేదంటూ జాదవ్ ప్రశ్నించగా.. మనసు మార్చుకున్న సెలెక్టర్లు అతడికి అవకాశం కల్పించారు.

కేదార్ జాదవ్‌పై ఎమ్మెస్కే స్పందన
"కేదార్ జాదవ్ తరచుగా గాయపడతాడన్న కారణంగా మూడో వన్డేలోకి ఎంపిక చేయలేదు. గతంలోనూ ఒకటి రెండుసార్లు అతను జట్టులోకి పునరాగమనం చేయడం, వెంటనే గాయపడటం జరిగింది. దేశవాళీలో ఆడించేందుకు భారత-ఎ జట్టులో గురువారం చోటిచ్చాం. కేవలం అతనికి ఒక మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అతడి ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకి రాలేమని విండీస్‌తో చివరి 3 వన్డేలకు ఛాన్స్ ఇవ్వలేదని" జాదవ్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ సర్ది చెప్పారు.

చివరి రెండు వన్డేలకు కేదార్ జాదవ్ ఎంపిక
అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ... శుక్రవారం రాత్రి కేదార్ జాదవ్‌ను చివరి రెండు వన్డేలకు ఎంపిక చేశామని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్ అనంతరం జరగనున్న మూడు టీ20ల సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఓపెనర్ రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

కోహ్లీకి విశ్రాంతి
టెస్టు సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్ పూర్తిగా ఆడుతుండడంతో అతడిపై పనిభారం పడకూడదని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నవంబరు 21 నుంచి ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌తో పాటు కృనాల్ పాండ్యా కూడా విండిస్‌తో టీ20 సిరిస్‌కు జట్టులో చోటు దక్కించుకున్నారు.
విండిస్‌తో మూడు టీ20లకు ఎంపికైన భారత ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ నదీమ్
ధోనిపై వేటు
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తొలిసారిగా సెలెక్టర్లు వేటు వేశారు. వెస్టిండీస్‌తో జరగబోయే మూడు టీ20లతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఆడే మరో మూడు టీ20ల కోసం జాతీయ సెలెక్టర్లు ఒకేసారి జట్లను ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఇందులో ధోనికి చోటు దక్కలేదు. దీంతో టీ20ల్లో ధోని కెరీర్ ముగిసినట్టే అని కథనాలు వినిపిస్తుండగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం వీటిని ఖండించారు. "ధోనీ ఆరు టీ20ల్లో ఆడడం లేదు. మేం సమర్థుడైన రెండో వికెట్‌కీపర్ కోసం ఎదురు చూస్తున్నాం. అంతేకానీ అతడికి ద్వారాలు మూసుకుపోలేదు" అని స్పష్టం చేశారు. విండీస్‌తో మూడు టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో 3టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications