Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా ముందస్తు రాఖీ వేడుక.. ఎదుకంటే!!

India vs West Indies: Jasprit Bumrah Celebrates Raksha Bandhan Early

ముంబై: టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు రోజుల ముందుగానే తన సోదరి జుహికతో రాఖీని కట్టించుకున్నాడు. ఆగష్టు 15న (గురువారం) రాఖీ పండగ ఉంది. అయితే వెస్టిండీస్‌తో ఆగస్టు 22న ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు బుమ్రా ప్రయాణం కానుండడంతో ముందుగానే తన సోదరితో రాఖీ పండగను జరుపుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బుమ్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

అస్సలు వదులుకోలేను:

అస్సలు వదులుకోలేను:

బుమ్రా తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫొటోను ట్విటర్‌ ద్వారా పోస్ట్‌ చేశాడు. 'టెస్ట్ సిరీస్ కారణంగా నేను ఈ రాఖీ పండగకు ఇక్కడ ఉండలేను. అయినా నీతో రాఖీ కట్టించుకునే అవకాశాన్ని నేను అస్సలు వదులుకోలేను జుహిక. ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు' అంటూ బుమ్రా రాసుకొచ్చాడు. అంతేకాదు ఇద్దరు కలిసి దిగిన పోటోలను బుమ్రా అభిమానులతో పంచుకున్నాడు.

'ఆసీస్‌ను ఓడించడానికి కేవలం ఆర్చర్‌పై ఆధారపడటం ఇష్టం లేదు'

వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి:

ఇప్పటికే తీరికలేని క్రికెట్ ఆడుతున్న బుమ్రాకు విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే టెస్ట్ సిరీస్‌కు మాత్రం ఎంపిక చేశారు. రెండు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆగస్టు 22 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17 నుంచి 19 వరకు ఇరు జట్లు మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఉంది. దీంతో బుమ్రా విండీస్‌కు పయనమవనున్నాడు.

సిరీస్‌పై గురి:

సిరీస్‌పై గురి:

వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ గురువారం మరో కీలక సమరానికి సిద్దమయింది. బుధవారం జరిగే చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడుతుంది. రెండో వన్డేలో విజయం సాధించి 1-0తో ఆదిక్యంలో ఉన్న భారత్‌.. సిరీస్‌పై గురి పెట్టింది. టీ20 సిరీస్‌ లాగే వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆతిథ్య వెస్టిండీస్‌ భావిస్తోండి.

Story first published: Wednesday, August 14, 2019, 9:23 [IST]
Other articles published on Aug 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+