విండిస్ పర్యటన షురూ: Ist T20I: మ్యాచ్ టైమింగ్, ఎక్కడ చూడాలి

హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసింది. ఇక, జట్లన్నీ ద్వైపాక్షిక సిరిస్‌ల్లో నిమగ్నమయ్యాయి. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే అమెరికాలోని ఫ్లోరిడాకు చేరుకుంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.
ఈ పర్యటనలో మొదటి రెండు టీ20లు అమెరికాలోని ప్లోరిడా వేదికగా జరగనున్నాయి. అనంతరం మిగతా సిరిస్ అంతా కరేబియన్ దీవులకు మారనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 శనివారం జరగనుంది. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది.
అయితే, తాజా సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది. ఇందులో భాగంగా వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా సిద్ధమైంది.

ఇండియా
వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత టీ20 సిరిస్ ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు సీనియర్ బౌలర్లకు విశ్రాంతినిచ్చి యువ బౌలర్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ముఖ్యంగా నవదీప్ షైనీ, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, కృనాల్ పాండ్యా వంటి యువ బౌలర్లకు ఈ పర్యటన ఒక గొప్ప అవకాశం. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విండిస్ పర్యటనలో రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లు ఇద్దరే అంతర్జాతీయ అనుభవం కలిగి ఉన్నారు.

వెస్టిండిస్
ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండిస్ తన చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో భారతతో జరగనున్న సిరిస్‌లో సత్తా చాటాలని వెస్టిండిస్ క్రికెటర్లు ఊవిళ్లూరుతున్నారు. ఇక, టీ20ల్లో వెస్టిండిస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టీ20 సిరిస్ అంటేనే ఆ జట్టు క్రికెటర్లు విజృంభిస్తారు. కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్ మెయిర్, సునీల్ నరేన్ వంటి క్రికెటర్లు ఈ సిరిస్‌లో సత్తా చాటే అవకాశం ఉంది.

భారత జట్టులో కీలక ఆటగాళ్లు
రోహిత్ శర్మ,
భువనేశ్వర్ కుమార్,
రిషబ్ పంత్

వెస్టిండిస్ జట్టులో కీలక ఆటగాళ్లు
ఆండ్రీ రస్సెల్,
సునీల్ నరేన్,
షిమ్రాన్ హెట్ మెయిర్

జట్ల వివరాలు
భారతదేశం: విరాట్ కోహ్లీ (సి), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీక్ అహ్మదర్ నవదీప్ సైని.
వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, షిమ్రాన్ హెట్మియర్, నికోలస్ పూరన్, కీరోన్ పొలార్డ్, రోవ్మన్ పావెల్, కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కీమో పాల్, సునీల్ నరైన్, షెల్డన్ కాట్రెల్, ఓషాన్ థామస్, ఆంథోనీ బ్రాంబుల్, ఆండ్రీ రస్సెల్, ఖారీ పియరీ.

టెలికాస్ట్ డిటేల్స్
మ్యాచ్ ప్రారంభం: రాత్రి 8 గంటలకు
సోనీ టెన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక, ఆన్‌లైన్‌లో సోనీ లివ్‌లో చూడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications