
రోహిత్ ఏమన్నాడంటే..
''మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాము. మేము గతంలోనూ మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. స్కోర్ బోర్డులో ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెడతాం. బౌలర్లు గత గేమ్‌లో బాగా ఆడారు. జట్టుగా మేము ఏమి సాధించాలనుకుంటున్నామో అది చేయాలి. మా బౌలింగ్ యూనిట్‌పై మాకు గట్టి విశ్వాసం ఉంది. మేము మూడు మార్పులతో ఈ మ్యాచ్‌లు బరిలోకి దిగుతున్నాం. కేఎల్ రాహుల్, దీపక్ హుడా, చాహల్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. వారి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్ ఆడుతున్నారు.'' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

పూరన్ ఏమన్నాడంటే..
''మేము మళ్లీ మొదట బౌలింగ్ చేయబోతున్నాం. చివరి గేమ్‌లో సత్తా చాటలేకపోయాం. ఈ రోజు రాణిస్తామని ఆశాజనకంగా ఉన్నాం. బ్యాటర్లు ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలి. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలో దిగుతున్నాం. అకేల్ హోసేన్ స్థానంలో హేడెన్ వాల్ష్ జట్టులోకి వచ్చాడు.'' అని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తెలిపాడు.

తుది జట్లు
వెస్టిండీస్:
షాయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్, కెమర్ రోచ్
భారత్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

పిచ్ రిపోర్టు
వాతావరణం సాధారణంగా ఉండనుంది. వర్షం వచ్చే అవకాశాలు లేవు. సిరీస్‌లో ముగిసిన గత రెండు వన్డే మ్యాచ్‌ల తరహాలోనే పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. మంచు ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.

ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం
ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన వైట్‌వాష్‌పై కన్నేసింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేను కూడా గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. కాగా తొలి వన్డేలో వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా, రెండో వన్డేలో 44 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












