For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్ 2-0తేడాతో వెస్టిండీస్‌ను ఓడించగలదు'

India vs West Indies 2018 : Carl Hooper Talks About Indian Team
India vs West Indies: India will win two-Test series 2-0, says Carl Hooper

హైదరాబాద్: భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ పట్ల ఆ దేశ మాజీ క్రికెటర్ కార్ల్ హోపర్ నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచ నెంబర్.1 టెస్టు ర్యాంకింగ్ హోదాతో కొనసాగుతున్న టీమిండియాను గెలుచుకోవడం వెస్టిండీస్ ప్రస్తుత జట్టుకు కష్టతరమని అభిప్రాయపడ్డాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్‌తో తలపడుతోన్న మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టే ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు.

కొన్నేళ్ల క్రితం జట్టులో క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డేన్ బ్రావో, సునీల్ నరైన్‌లు జట్టు రాణించడంలో సాయపడేవారు. ఇప్పుడు వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా టీ లీగ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నారు. 'ఈ క్రమంలో టీమిండియా వెస్టిండీస్‌ను ఈ సిరీస్‌లో 2-0తేడాతో ఓడించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కానీ, నేనొక్కటే కోరుకుంటున్నా. భారత్ చేతిలో వెస్టిండీస్ జట్టు పూర్తిగా తుడిచిపెట్టుకోకపోతే చాలు.' అని జట్టులోని ఆటగాళ్లను విశ్లేషించాడు. దాంతో పాటుగా హేమర్, క్రెగ్ బ్రాత్ వైట్‌లు బాగా రాణిస్తారనే ఆశపడుతున్నానని అన్నాడు.

1
44264

'క్రిస్ గేల్ వయస్సు రీత్యా పెద్ద వాడైపోయాడు. కీరన్ పొలార్డ్ కూడా 30ల్లోకి చేరుకున్నాడు. ఇక సునీల్ నరైన్ కూడా టెస్టులకు వచ్చేందుకు చాలా ఆలస్యమైపోయింది. ఇదే జట్టును ఏడేళ్ల క్రితం పరిశీలిస్తే అంచనాలన్నీ తారుమారయ్యేవి. టీ20 స్పెషలిస్టుగా మారిన క్రిస్ గేల్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రాణిస్తే సమస్యేంటో నాకర్థం కావడం లేదు' అని పేర్కొన్నాడు.

కార్ల్ హోపర్ అతని అరంగ్రేట మ్యాచ్‌ను టీమిండియాతో 1987లో ఆడాడు. అతని కెరీర్‌లో భారత్‌తో చివరి సారిగా 2002లో ఆడాడు. టెస్టు కెరీర్‌లో హోపర్ ఖాతాలో 13టెస్టు సెంచరీలున్నాయి.

Story first published: Thursday, October 4, 2018, 15:57 [IST]
Other articles published on Oct 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+