Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15న తొలి వన్డే.. చెన్నై చేరిన కోహ్లీసేన!!

India vs West Indies: India, West Indies team reach Chennai for first ODI

చెన్నై: వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈనెల 15న తొలి వన్డే మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీసేన గురువారం ముంబై నుండి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంది.

టచ్‌డౌన్‌ చెన్నై:

టచ్‌డౌన్‌ చెన్నై:

చెన్నై రాక సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విటర్‌లో ఒక ఫొటో పంచుకున్నాడు. అందులో రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ విజయ చిహ్నం చూపిస్తూ కనిపించారు. దీనికి 'టచ్‌డౌన్‌ చెన్నై' అనే క్యాప్షన్‌ను కోహ్లీ పెట్టాడు. మరోవైపు విండీస్ జట్టు కూడా చెన్నై చేరుకుంది. చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో ఈ రోజు నుండి ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి.

ధావన్‌ స్థానంలో మయాంక్‌:

ధావన్‌ స్థానంలో మయాంక్‌:

రెగ్యులర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ స్థానంలో టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. వన్డే సిరీస్‌ కోసం బుధవారం బీసీసీఐ సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. మయాంక్‌ చోటు దక్కించుకోవడంతో కేరళ యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది. రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా జట్టులో కేఎల్‌ రాహుల్‌ ఉండటంతో.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌ వైపు బీసీసీఐ సెలక్టర్లు మొగ్గు చూపారు.

రాహుల్‌ నుండి గట్టి పోటీ:

రాహుల్‌ నుండి గట్టి పోటీ:

15 మంది సభ్యుల్లో చోటు దక్కించున్న మయాంక్‌ మరి తుది జట్టులో ఉంటాడో లేదో చూడాలి. మయాంక్‌కు ఉన్నది ఒకటే ఆప్షన్. అది రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడం. ఇందుకు కేఎల్‌ రాహుల్‌ గట్టి పోటీ ఇస్తున్నాడు. తొలి వన్డే ఈనెల 15న చెన్నైలో.. రెండో వన్డే 18న విశాఖపట్నంలో.. మూడో వన్డే 22న కటక్‌లో జరుగుతాయి.

వన్డే జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌.

Story first published: Friday, December 13, 2019, 8:54 [IST]
Other articles published on Dec 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+