'టీమిండియా బ్యాటింగ్ ఎలా చేయాలో చూపించింది'

రాజ్‌కోట్: భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి పట్ల వెస్టిండీస్ కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు. టీమిండియా టెస్టుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు చూపించిందని తాత్కాలిక కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ అభిప్రాయపడ్డాడు. రాజ్‌కోట్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

రెండో టెస్టులోనైనా సానుకూల దృక్పథంతో
మ్యాచ్ అనంతరం బ్రాత్‌వైట్ మాట్లాడుతూ ‘టెస్టులో మాకు మెరుగైన ఆరంభం లభించలేదు. ఆ ఘనత ముమ్మాటికీ భారత్‌దే. టెస్టులో ఎలా బ్యాటింగ్ చేయాలో వారు మాకు చూపించారు. మ్యాచ్‌లో మాకు మెరుగైన బ్యాటింగ్ భాగస్వామ్యాలు దక్కలేదు. కనీసం ఓ రెండు మూడు భాగస్వామ్యాలు దక్కి ఉన్నా.. గట్టి పోటీనిచ్చేవాళ్లం. సిరీస్ ఆరంభ టెస్టులోనే ఓడిపోవడం నిరాశ కలిగించింది. కనీసం రెండో టెస్టులోనైనా సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం'అని వెల్లడించాడు.

వెస్టిండీస్ 181 పరుగులకే ఆలౌటవగా
మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. కెప్టెన్ విరాట్ కోహ్లి (139), పృథ్వీ షా (134), రవీంద్ర జడేజా (100 నాటౌట్) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని 649/9 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 181 పరుగులకే ఆలౌటవగా.. అనంతరం ఫాలో ఆన్ ఆడి రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు 196 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో రెండన్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాబోయే శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో వివాదం తలెత్తడంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరగాల్సిన రెండో వన్డే భారత్, వెస్టిండీస్ మధ్య అక్టోబరు 24న ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో నిర్వహించనున్నారు. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లో పోటీ పడనున్నాయి.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పృథ్వీ షా
అరంగేట్ర టెస్టులోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'అవార్డు అందుకున్న ఆరో భారత ఆటగాడు పృథ్వీ షా. ప్రవీణ్ ఆమ్రె, ఆర్పీ సింగ్, అశ్విన్, ధావన్, రోహిత్ కూడా ఈ ఘనత సాధించారు. పృథ్వీతో పాటు అశ్విన్, రోహిత్ కూడా వెస్టిండీస్‌పైనే అరంగేట్రం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications