
రెండు దశాబ్దాల పాటు ఒక్క విజయం కూడా
భారత్ గడ్డపై 1933-34లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా.. దాదాపు రెండు దశాబ్దాల పాటు కనీసం ఒక విజయం కూడా నమోదు చేయలేకపోయింది. అయితే.. 1952లో తొలిసారి ఇంగ్లాండ్‌ని ఇక్కడ ఓడించి గెలుపు రుచి చూసిన భారత్ జట్టు.. స్వదేశంలో రాజ్‌కోట్ మ్యాచ్‌తో కలిపి మొత్తం 266 టెస్టులాడి.. వందో విజయాన్ని అందుకుంది.

ఘోర పరాజయం పట్ల వెస్టిండీస్ కెప్టెన్ విచారం
స్వదేశంలో ఎక్కువ టెస్టుల్లో గెలుపొందిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా (238 విజయాలు), ఇంగ్లాండ్ (217), దక్షిణాఫ్రికా (104) తొలి మూడు స్థానాల్లో ఉండగా.. భారత్ (100) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి పట్ల వెస్టిండీస్ కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు.

272 పరుగుల తేడాతో ఘోరంగా విఫలమై..
మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. కెప్టెన్ విరాట్ కోహ్లి (139), పృథ్వీ షా (134): , రవీంద్ర జడేజా (100 నాటౌట్) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని 649/9 వద్ద డిక్లేర్ చేయగా.. ఆ తర్వాత వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ అయింది. రాజ్‌కోట్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్
టీమిండియా టెస్టుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు చూపించిందని తాత్కాలిక కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాబోయే శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లో పోటీ పడనున్నాయి.


Click it and Unblock the Notifications

