For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్టులో ఆడే తుది జట్టిదే: మయాంక్‌కు దక్కని చోటు

India Vs West Indies: India 12-man squad announced for Hyderabad Test; Mayank Agarwal ignored

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా పర్యాటక వెస్టిండిస్ జట్టుతో శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టులో ఆడబోయే తుది జట్టును జట్టు మేనేజ్‌మెంట్ గురువారం ప్రకటించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆడిన జట్టునే హైదరాబాద్ టెస్ట్‌లోనూ కొనసాగించాలని నిర్ణయించింది.

Twitterati Left Infuriated As Mayank Agarwal Is Benched Again

ఈ సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలనుకున్న హైదరాబాద్‌ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. మహ్మద్ సిరాజ్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ మొండిచెయ్యి చూపించింది. సిరాజ్‌తో పాటు మరో తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి సైతం రెండో టెస్ట్‌ తుది జట్టులో చోటు దక్కలేదు.

12 మంది ఆటగాళ్లతో తుది జట్టు

12 మంది ఆటగాళ్లతో తుది జట్టు

రెండో టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్‌, విహారిల పేర్లు లేకపోవడం విశేషం. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్ట్‌లో సైతం బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో వీరు పేర్లు ఉంటాయని అందరూ భావించారు.

మయాంక్‌ అగర్వాల్‌కు కూడా నిరాశే

మయాంక్‌ అగర్వాల్‌కు కూడా నిరాశే

కానీ బీసీసీఐ ఇందుకు భిన్నంగా జట్టుని ప్రకటించింది. మరోవైపు మయాంక్‌ అగర్వాల్‌కు కూడా నిరాశే ఎదురైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు అవకాశం కల్పిస్తారని భావించినా జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దేశవాళీ, భారత్‌-ఏ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన మయాంక్ తొలి టెస్టు ఆడేందుకు మరికొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు.

 కేఎల్‌ రాహుల్‌కు మరో అవకాశం

కేఎల్‌ రాహుల్‌కు మరో అవకాశం

తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ విఫలమైనా అతనికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనే రాహుల్‌కు మరో అవకాశం ఇచ్చి ఉంటారని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడానికి ముందు టీమిండియా ఆడనున్న చివరి టెస్టు ఇదే కావడంతో పూర్తి స్థాయి జట్టుని బరిలోకి దించాలని నిర్ణయించారు.

 ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లుతో జట్టు

ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లుతో జట్టు

ఈ నేపథ్యంలో 12 మందితో కూడిన తుది జట్టుని గురువారం జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇందులో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు ఉండగా... ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ మరోసారి హైదరాబాద్ టెస్టు తుది జట్టులో స్థానం కోసం పోటీ పడనున్నారు. తుది జట్టులో ముగ్గుర్లు స్పిన్నర్లు అవసరమైతే.. శార్థుల్‌ ఠాకుర్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగితే కుల్దీప్‌‌పై వేటు

ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగితే మాత్రం కుల్దీప్‌ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఓడించి.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

హైదరాబాద్ టెస్టుకు టీమిండియా:

విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రిషబ్ పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమి, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.

Story first published: Thursday, October 11, 2018, 14:02 [IST]
Other articles published on Oct 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+