For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West indies హెడ్ టూ హెడ్‌ టీ20 రికార్డ్సు! తోపు ఎవ‌రంటే..

India vs West indies Head to Head T20 Records list

కోల్‌క‌తా: బుధ‌వారం నుంచి భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గబోతుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఈ నెల 20 వ‌ర‌కు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 16న తొలి టీ20, 18న రెండో టీ20, 20న మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇరు జ‌ట్ల టీ20 రికార్డుల‌ను అభిమానులు ఒక‌సారి ప‌రిశీలిస్తున్నారు. ఇండియా, వెస్టిండీస్ టీ20 రికార్డుల్లో ఇండియాదే పై చేయిగా ఉంది. ఇరు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు 17 టీ20 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. అత్య‌ధికంగా ఇండియా 10 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. విండీస్ 6 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు.

ఇక ఇండియాలో జ‌రిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 5 గెల‌వ‌గా.. వెస్టిండీస్ 2 మాత్ర‌మే గెలిచింది. అదే స‌మయంలో వెస్టిండీస్‌లో జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఇరు జ‌ట్లు స‌మంగా విజ‌యం సాధించాయి. క‌రేబియ‌న్ గ‌డ్డ‌పై ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్, వెస్టిండీస్ రెండేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఇక ఇండియా, వెస్టిండీస్ కాకుండా ఇత‌ర వేదిక‌ల్లో జ‌రిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 3, విండీస్ జ‌ట్టు రెండు గెలిచాయి. ఇక ఇటీవ‌ల ముగిసిన మూడు వ‌న్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగ‌తి తెలిసింది.

టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్‌, య‌జ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీప‌క్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జ‌యంత్ యాద‌వ్‌, సూర్యకుమార్ యాదవ్.

IND vs WI 1st ODI: Team India Win 1000th ODI, Take 1-0 Lead | Oneindia Telugu

టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు:
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్.

Story first published: Tuesday, February 15, 2022, 17:00 [IST]
Other articles published on Feb 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+